Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు సైనికులపై కాల్పులు!

Share It:

వాషింగ్టన్‌: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. అధ్యక్షభవనం వైట్‌హౌస్‌ సమీపంలో ఇద్దరు నేషనల్‌ గార్డ్స్‌పై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ ఇద్దరు సైనికులు మరణించారని విశ్వసనీయ సమాచరం. కాల్పుల తర్వాత వైట్ హౌస్ లాక్ చేశారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్పులు జరిగినప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నారు. 500 మంది నేషనల్ గార్డ్స్‌ను వైట్ హౌస్ ప్రాంతానికి పంపాలని డోనాల్డ్ ట్రంప్ ఆదేశించారని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తెలిపారు.

కాగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై కూడా కాల్పులు జరిపారు. దర్యాప్తు కొనసాగుతున్నందున మేము ఫెడరల్‌ అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నాము” అని గవర్నర్ పాట్రిక్ మోరిసే చెప్పారు.

సంఘటనా స్థలం నుండి సీసీటీవీ ఫుటేజ్‌ను అధికారులు సమీక్షిస్తున్నారు. అనుమానితుడు సైనికుల వద్దకు వెళ్లి తుపాకీని బయటకు తీశాడని నమ్ముతున్నట్లు వార్తాసంస్థతో మాట్లాడిన అధికారి తెలిపారు. సైనికులలో ఒకరు దుండగుడిని కాల్చారని ఆయన తెలిపారు. అనుమానితుడు ఏదైనా నిర్దిష్ట కారణం చేత దళాలను లక్ష్యంగా చేసుకుంటున్నాడా అనే దానితో సహా, నిందితుడి ఉద్దేశ్యాన్ని గుర్తించడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

వైట్ హౌస్‌కు వాయువ్యంగా దాదాపు రెండు బ్లాక్‌ల దూరంలో కాల్పులు జరిగాయి. సోషల్ మీడియాలో షేర్‌ చేసన వీడియోలో.. సైనికులలో ఒకరిని CPR చేస్తున్నట్లు కనిపించగా, మరొకరికి ఫుట్‌పాత్‌పైచికిత్స చేస్తున్నట్లు కనిపించింది. ఇతర అధికారులు అడుగులు దూరంలో నేలపై ఒక వ్యక్తిని అడ్డుకుంటున్నట్లు చూడవచ్చు.

ప్రత్యక్ష సాక్షి స్టేసీ వాల్టర్స్ మాట్లాడుతూ… తాను సంఘటనా స్థలం సమీపంలో ఉన్న కారులో ఉన్నానని, రెండు తుపాకీ కాల్పులు విన్నానని, ప్రజలు పరిగెత్తుతున్నట్లు చూశానని చెప్పారు. తక్షణమే, పోలీసు బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిందని చెప్పారు.

ఈమేరకు వాషింగ్టన్‌ DC ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ విటో మాగియోలో మాట్లాడుతూ..అత్యవసర వైద్య బృందాలు ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. కాగా, దేశ రాజధానిలో నేషనల్ గార్డ్ ఉనికి నెలల తరబడి ఒక ముఖ్యమైన సమస్యగా ఉంది. ఇది కోర్టు పోరాటానికి, ట్రంప్ విధానాలు గురించి విస్తృత చర్చకు ఆజ్యం పోసింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.