జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో మాతా వైష్ణో దేవీ మెడికల్ కాలేజీ అడ్మిషన్ రగడ కొనసాగుతోంది. ఈ వివాదంలో బిజెపి మతతత్వ కోణాన్ని చూపుతోందని కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ యూనిట్ ఆరోపించింది. కేంద్రం, శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు వైఫల్యాల నుండి దృష్టిని మరల్చడానికి కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
ఆగ్రహం
జమ్మూకశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణో దేవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్‌లో ఈ సంవత్సరం 50 ఎంబీబీఎస్ మంజూరు అయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరానికి 42 మంది ఒక వర్గానికి చెందిన విద్యార్థుల ప్రవేశం వివాదానికి దారితీసింది. హిందూ సంఘాలు, ముఖ్యంగా బీజేపీ, ఇతర హిందూ సంస్థలు, వైష్ణోదేవి ఆలయ నిధులతో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో 50 సీట్లలో 42 సీట్లు ముస్లిం విద్యార్థులకు వెళ్లాయని ఆరోపిస్తున్నాయి. అడ్మిషన్లు మెరిట్ ఆధారంగా జరిగాయని సీఎం ఒమర్ అబ్దుల్లా సమర్థించినప్పటికీ, హిందూ సంస్థలు ఈ ప్రక్రియను సమీక్షించాలని, అడ్మిషన్ జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి
కొత్తగా స్థాపించిన ఈ సంస్థకు “మైనారిటీ సంస్థ” హోదాను ఇవ్వాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే, సంస్థకు మైనారిటీ హోదా మంజూరు చేయనందున, మతం ఆధారంగా ఎటువంటి రిజర్వేషన్ ప్రమాణాలను వర్తించలేమని అధికారులు తెలిపారు.
J&K అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ నేతృత్వంలోని BJP ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం శనివారం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిసి అడ్మిషన్ జాబితాను రద్దు చేయాలని, …… “మాతా వైష్ణో దేవిపై విశ్వాసం ఉన్న” విద్యార్థులకు మాత్రమే సీట్లు రిజర్వేషన్ చేయాలని డిమాండ్ చేసింది.
కాగా, ఈ వివాదంపై J&K ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (JKPCC) ముఖ్య ప్రతినిధి రవీందర్ శర్మ స్పందించారు. “హిందువుల మతపరమైన భావాలు, హక్కులను” జాగ్రత్తగా చూసుకోవడంలో విఫలమైనందుకు BJP నేతృత్వంలోని కేంద్రం, ముఖ్యంగా ఆరోగ్య- కుటుంబ సంక్షేమ శాఖ, పుణ్యక్షేత్ర బోర్డు బాధ్యత వహించాలని అన్నారు.
ఈ విషయానికి మతపరమైన రంగు ఇవ్వడం, బిజెపి, దానితో సంబంధం ఉన్న అధికారులు కానీ చట్టం-నియమాల ప్రకారం సరైన మార్గాన్ని అనుసరించకుండా సంఘం హక్కులు, మతపరమైన భావాలను మతపరమైన భావాలను కాపాడడంలో విఫలమయ్యారు. అధికారుల తప్పుకు మతపరమైన మలుపు ఇచ్చి, అడ్మిషన్లపై ప్రశ్నలు లేవనెత్తడం ఎందుకు అని శర్మ అన్నారు.”
ఈ ఘటనలో బీజేపీ దాని అనుబంధ అధికారుల కుట్ర బయటపడిందని కాంగ్రెస్ నేత పునరుద్ఘాటించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం హిందూ సమాజం హక్కులు, మతపరమైన భావాలను గౌరవించే చర్యలు తీసుకోవాలని తన పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డాను కోరాలని రవీందర్ శర్మ అన్నారు.
కాగా, ఎంబీబీఎస్ అడ్మిషన్ల వివాదంపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ… శ్రీ మాతా వైష్ణో దేవి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అసెంబ్లీ బిల్లును ఆమోదించినప్పుడు, ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన బాలురు, బాలికలను దాని నుండి దూరంగా ఉంచుతామని ఎక్కడ రాసిపెట్టారని బీజేపీని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయంలో ప్రవేశం మతం ఆధారంగా కాకుండా, మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతుందని చట్టంలో ఉందని గుర్తుచేశారు. మెరిట్ లేకుండా అడ్మిషన్లు ఇవ్వాలనుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు.


