Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఓయూ హాస్టల్‌లో నాసిరకం భోజనం…విద్యార్థుల నిరసన!

Share It:

హైదరాబాద్: కల్తీ ఆహారం పెడుతున్నారంటూ ఓయూలో విద్యార్థులు నిరసనకు దిగారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా హాస్టల్ విద్యార్థులు నాసిరకం ఆహారం వడ్డించారని ఆరోపిస్తూ నిన్న రాత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు.

వైస్ ఛాన్సలర్, చీఫ్ వార్డెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, E1 హాస్టల్ విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి, ఆహారాన్ని తీసుకొచ్చి రోడ్డుపై పెట్టారు. మెస్ సమస్యలు, ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై పదేపదే ఫిర్యాదులు చేసినప్పటికీ, అధికారులు పెడ చెవిన పెట్టారని విద్యార్థులు వాపోయారు.

హాస్టల్లో వడ్డించే పాడైపోయిన ఆహారంతో తాము అనారోగ్యాలకు గురవుతున్నామని ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, హాస్టళ్లలో కనీస వసతులు కల్పించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆకస్మికంగా రోడ్డుపై బైఠాయించడంతో క్యాంపస్‌లో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

సమాచారం అందుకున్న OU పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. “నిరసనను విరమించారు. ఈ విషయమై విద్యార్థులు అధికారులను కలుస్తారని పోలీసులు తెలిపారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.