Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజున రూ.2.43 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు!

Share It:

హైదరాబాద్: ఫ్యూచర్‌ సిటీలో ‘తెలంగాణ రైజింగ్‌’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్‌ సమ్మిట్‌ నిన్నఅట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజున తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ పెట్టుబడి ప్రతిపాదనలు డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, పవర్, ఫిల్మ్, మీడియా, ఏరోస్పేస్ వంటి విభిన్న రంగాల నుంచి వచ్చాయి. దీంతో రాష్ట్ర యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు లభించనున్నాయి.

ఈ భారీ పెట్టుబడులు తెలంగాణ రైజింగ్ 2047 దిశగా బలమైన పునాదులు వేస్తాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడివిడిగా చర్చలు జరిపారు.

ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు, తెలంగాణ ప్రభుత్వంపై దేశీయ, అంతర్జాతీయ సంస్థల విశ్వాసానికి రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నాణ్యమైన ఉపాధి అవకాశంగా, మౌలిక సదుపాయాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డీప్ టెక్ సిటీ నుంచి టెక్స్టైల్ యూనిట్వరకు అన్ని రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వైవిధ్యమైన పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకు రావడం తెలంగాణ సుస్థిర ప్రారిశ్రామిక విధానాన్ని ప్రపంచానికి చాటిచెబుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

ప్రధాన పెట్టుబడులు

ఇక బ్రూక్ఫెల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి రూ.75 వేల కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ వలప్మెంట్, డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చెందిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రూ.41 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. హైదరాబాద్లో అంతర్జాతీయ మీడియా, స్మార్ట్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మెగా డిజిటల్ మీడియా హబ్ ఏర్పాటుతో వేలాది మంది ఉద్యోగాలు రానున్నాయి.

→ ఈవెరెన్‌ యాక్సిస్‌ ఎనర్జీ రూ.31,500 కోట్లతో సోలార్ పవర్, విండ్ పవర్మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

→ పునరుత్పాదక విద్యుత్, ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ రూ.27,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం.

ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో మెయిన్టెన్స్, రిపేర్, ఓవర్‌హాల్‌తో పాటు కార్గో విస్తరణకు జీఎంఆర్ గ్రూప్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది.

→ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు చెందిన సల్మానాఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీ రూ. 10,000 కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్షిప్, ఫిల్మ్‌అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో వినోద వసతులు కల్పించనుంది.

→మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ రూ.8 వేల కోట్లతో సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఈనీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. రెన్యూసిస్, మిడ్ వెస్ట్, అక్షత్న్టేక్ ఎలక్ట్రానిక్స్ హైడ్రోజన్ టెక్ విస్తరణకు రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.

ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కృష్ణా పవర్‌యుటిలిటీస్‌ పెట్టుబడి రూ. 5,000 కోట్లు, ప్రముఖ సంస్థ అతిథత్ హోల్డింగ్స్ రాష్ట్రంలో 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజి) ప్లాంట్లు నెలకొల్పనుంది. వాటిని స్థాపించేందుకు రూ.4,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. సీతారాం స్పిన్నరూ. 3 వేల కోట్లతో టెక్స్‌టైల్‌ యూనిట్ నెలకొల్పనుంది.

మొత్తం పెట్టుబడులలో, డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ, కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ. 1,04,000 కోట్లు. ఈ పెట్టుబడి క్లస్టర్ మొదటి రోజు మొత్తంలో సగానికి పైగా వాటాను కలిగి ఉంది, ఇది తదుపరి తరం పట్టణ, డిజిటల్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిందని అధికారిక ప్రకటన పేర్కొంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.