Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

సోషల్ మీడియా నిబంధనలు…భారతీయుల H-1B వీసా అపాయింట్‌మెంట్‌లు వాయిదా!

Share It:

న్యూఢిల్లీ: యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ విధానం భారతదేశంలోని H-1B వీసా దరఖాస్తుదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. చాలా మంది ఆశావహుల అపాయింట్‌మెంట్‌లు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి. ఈమేరకు మనదేశంలోని యుఎస్ ఎంబసీ నిన్న రాత్రి వీసా దరఖాస్తుదారులకు తెలిపింది.

“మీ వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయిందని మీకు ఇమెయిల్ అందినట్లయితే, మిషన్ ఇండియా మీ కొత్త అపాయింట్‌మెంట్ తేదీలో మీకు సహాయం చేయడానికి ఎదురుచూస్తోంది” అని అది తెలిపింది.

అలాగే రీషెడ్యూలింగ్ గురించి తెలియజేసిన తర్వాత కూడా గతంలో షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూ తేదీకి కాన్సులేట్‌కు రావొద్దని సూచించింది. డిసెంబర్ మధ్య నుండి చివరి వరకు జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అయితే, ఖచ్చితమైన రీషెడ్యూల్‌ తేదీలేవో తెలియదు.

ఈ విషయమై అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాది స్టీవెన్ బ్రౌన్ మాట్లాడుతూ… “మిషన్ ఇండియా మేము వింటున్న విషయాన్ని ధృవీకరిస్తుంది. వారు రాబోయే వారాల్లో అనేక ఇంటర్వ్యూలను రద్దు చేశారు. సోషల్ మీడియా పరిశీలనకు వీలుగా మార్చికి వాటిని తిరిగి షెడ్యూల్ చేశారు” అని అన్నారు.

H-1B వీసా దరఖాస్తుదారులు, వారి H-4 ఆధారపడిన వారి కోసం స్క్రీనింగ్, పరిశీలన చర్యలను US ప్రభుత్వం విస్తరించింది. వారి అన్ని సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో గోప్యతా సెట్టింగ్‌లను “పబ్లిక్”గా ఉంచాలని వారిని ఆదేశించింది. వీసా దరఖాస్తుదారులను అనుమతించని లేదా అమెరికా జాతీయ భద్రతకు లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారిని గుర్తించడానికి అధికారులు డిసెంబర్ 15 నుండి వారి ఆన్‌లైన్ ఉనికిని సమీక్షిస్తారు.

సోషల్ మీడియా వెట్టింగ్ (వీసా జారీ చేయడానికి ముందు అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం)తో పాటు స్క్రీనింగ్‌ను విస్తృతం చేశారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించే వారి వీసాల రద్దును ముమ్మరం చేశారు. ఇక కొన్నినెలల క్రితం హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా ప్రభుత్వం.. హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్టిన్ పేజీలు, రెజ్యూమ్‌లను సమీక్షించాలని ఇటీవల తన దౌత్యవేత్తలకు అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ఆదేశాలు ఇచ్చింది. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలో వీసా అపాయింట్మెంట్లు వాయిదా పడ్డాయి.

https://x.com/USAndIndia/status/1998399737075032568?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1998399737075032568%7Ctwgr%5E73ff09e351348a80dfc4176a51d6211d8694f180%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Fworld-news%2Fh-1b-visa-appointments-postponed-for-many-indians-amid-us-social-media-rules-us-visas-h-1b-h-4-visas-visa-interviews-donald-trump-9782365

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.