Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ధనిక విదేశీయులకు మద్యం అమ్మకాలను ప్రారంభించిన సౌదీ అరేబియా!

Share It:

రియాద్: గత ఏడాది విదేశీ దౌత్యవేత్తలకు మాత్రమే లిక్కర్‌ విక్రయాలను ప్రారంభించిన సౌదీ అరేబియా తాజాగా మద్యం అమ్మకాలపై ఉన్న ఆంక్షలను సడలించింది. నెలకు కనీసం 50,000 రియాల్స్ (రూ. 11,97,799) సంపాదించే ముస్లిమేతర విదేశీయులు ఇప్పుడు మద్యం కొనుగోలు చేయడానికి అనుమతించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ చారిత్రక మార్పు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో జరుగుతున్న విస్తృత సామాజిక సంస్కరణల్లో భాగం కావడం గమనార్హం.

ఇస్లాం…ఆ దేశ అధికారిక మతం. దీంతో పవిత్ర ఖురాన్… మొదటి నుంచీ ఆ దేశ చట్టాలు, సామాజిక నిబంధనలను ప్రభావితం చేసింది. అంతేకాదు ఇటీవలి సంవత్సరాలలో మహిళలు డ్రైవింగ్ చేయడంపై దేశవ్యాప్తంగా నిషేధం వంటి అనేక చట్టాలను ఎత్తివేశారు.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం… అధిక ఆదాయం ఉన్న ముస్లిమేతర విదేశీ పౌరులు రాజధాని నగరం రియాద్‌లో ఉన్న దేశంలోని ఏకైక మద్యం దుకాణం నుండి మద్యం కొనుగోలు చేయడానికి అనుమతిస్తారు. ఈ దుకాణం ప్రారంభంలో విదేశీ దౌత్యవేత్తలకు మాత్రమే అమ్మకాల కోసం ప్రారంభించారు. ఇటీవల ప్రీమియం రెసిడెన్సీ హోదా కలిగిన ముస్లిమేతరులకు అవకాశం కల్పించారు.

సౌదీ అరేబియాలో పౌరుల సగటు నెలవారీ జీతం 10,250 రియాల్స్, ఇది రూ. 2,45,548. సడలించిన ఆంక్షలను ఉపయోగించుకోవాలనుకునే నివాసితులు మద్యం దుకాణంలోకి అనుమతించే ముందు వారి నెలవారీ ఆదాయాన్ని రుజువు చేసే జీతం ధృవీకరణ పత్రాన్ని చూపించాలి.

నివేదిక ప్రకారం… దుకాణం మ్యాప్‌లలో కనిపించదు. లోకేషన్‌ను నేరు షేర్‌ చేసినప్పుడు మాత్రమే అక్కడికి చేరుకోవచ్చు. దుకాణం దగ్గర నియమితమైన గార్డులు కస్టమర్లను లోపలికి అనుమతించే ముందు వారి IDలను నిశితంగా తనిఖీ చేస్తారు.

అయితే ప్రభుత్వం నుండి అధికారిక నోటీసు రాలేదు. ఈ మార్పులు దేశవ్యాప్తంగా అమలు చేస్తారా లేదా అనేది అస్పష్టంగా ఉంది. కాగా, సౌదీలో 1950ల ప్రారంభం నుండి మద్యం నిషేధం అమలులో ఉంది. రాజ్య సామాజిక నిర్మాణంలో కీలక అంశంగా కొనసాగుతోంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.