Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

కర్ణాటకలో విందు రాజకీయాలు!

Share It:

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. అక్కడ ప్రస్తుతం విందు రాజకీయాలు నడుస్తున్నాయి. బెళగావిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైనారిటీలు, బీసీ శాసనసభ్యుల విందు తర్వాత, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ నగర శివార్లలో 50 మందికి పైగా ఎమ్మెల్యేలతో విడిగా విందు సమావేశం నిర్వహించారు.

అయితే, ఇది రాజకీయ బల ప్రదర్శన కాదని ఆయన ఖండించారు. ఇది దీర్ఘకాల పార్టీ శ్రేయోభిలాషుల ఒక సాధారణ పర్యటన అని అన్నారు. అసెంబ్లీ సమావేశం కొనసాగుతున్నప్పటికీ, వరుసగా జరిగిన సంఘటనలు కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి.

పార్టీ అంతర్గత వ్యక్తుల ప్రకారం… బెళగావి శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో శివకుమార్ విందుకు ఐదుగురు మంత్రులు సహా 50 మందికి పైగా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. డిసెంబర్ 19 తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో కీలకమైన సమావేశం నిర్వహించే అవకాశం ఉండటంతో, బల ప్రదర్శనకు సంబంధించిన చర్చకు ఈ ఘటన ఆజ్యం పోసింది.

తన తండ్రి ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేస్తారని యతీంద్ర సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్య తర్వాత ముఖ్యమంత్రి శిబిరానికి ప్రతిగా ఈ చర్య చేపట్టారని తెలుస్తోంది. ఈ ప్రకటన శివకుమార్ వర్గాన్ని చికాకు పెట్టిన విషయం తెలిసిందే.

ఇవన్నీ సాధారణ కార్యక్రమాలేనని నేతలు చెబుతున్నారు. “ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నాం. అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అదొక స్నేహపూర్వక సమావేశం” అని డీకే అన్నారు. స్థానిక మద్దతుదారుల నుండి ఆహ్వానాలు నిత్యకృత్యమని ఆయన అన్నారు. “ప్రతిరోజూ, ఎవరో ఒకరు మమ్మల్ని ఆహ్వానిస్తారు. మా నియోజకవర్గం నుండి స్థానిక ప్రజలు ప్రేమతో ఆహారం తెస్తారు. ఒక రోజు వారు, మరొక రోజు మరొకరు. నిన్న, షఫీక్ శెట్, ఫిరోజ్ శెట్ కూడా మమ్మల్ని ఆహ్వానించారు. కాబట్టి, మేము ఒక రోజు ఇక్కడకు, ఒక రోజు అక్కడికి వెళ్తామని ఆయన అన్నారు.

కాగా, కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తోన్న తరుణంలో ఈ బల ప్రదర్శనలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవంక సోనియా గాంధీ అధ్యక్షతన ఉన్నత స్థాయి చర్చలకు రెండు శిబిరాలు ఇప్పుడు సిద్ధమవుతున్నందున, కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత అధికార సమీకరణాలపై కొనసాగుతున్న చర్చకు… ఈ విందు సమావేశాలు మరింత రక్తి కట్టించాయి.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.