Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపుదిశగా అధికార బీజేపీ కూటమి!

Share It:

ముంబయి: మూడేళ్ల విరామం తర్వాత జరిగిన బీఎంసీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. కౌంటింగ్‌లో తొలుతనుంచి బీజేపీ ముందంజలో ఉండగా…శివసేన రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక బృహన్‌ముంబయి కార్పొరేషన్‌ ఎన్నికలో అధికార పార్టీ గెలుస్తుందన్న ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాల మేరకు బీజేపీ కూటమి… థాకరే సోదరులపై ఆధిక్యంలో కొనసాగుతోంది.

ప్రాథమిక అంచనాల ప్రకారం… బీఎంసీలో బీజేపీ నేతృత్వంలోని కూటమి 56 వార్డుల్లో ముందంజలో ఉంది. బీజేపీ 42 వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా, ఏక్‌నాథ్ షిండే శివసేన 14 వార్డుల్లో ముందంజలో ఉంది. కాగా, థాకరే సోదరులు ఓటమి బాటలో ఉన్నారు. ఉద్ధవ్ థాకరే శివసేన 30 వార్డుల్లో ముందంజలో ఉండగా, రాజ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) రెండు వార్డుల్లో ఆధిక్యంలో ఉంది.

వార్షిక బడ్జెట్ రూ. 74,400 కోట్లకు పైగా ఉన్న బీఎంసీకి జరిగిన ఎన్నికల్లో 227 స్థానాలకు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
2017లో జరిగిన గత ఎన్నికల్లో, ఉమ్మడి శివసేన (ఏక్‌నాథ్ షిండేతో సహా) దశాబ్దాలుగా తన నియంత్రణలో ఉన్న బీఎంసీపై పట్టును నిలుపుకుంది.

మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ల మొత్తం గణాంకాలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. మొత్తం లెక్కల ప్రకారం బీజేపీ 444 వార్డుల్లో, దాని మిత్రపక్షమైన షిండే నేతృత్వంలోని శివసేన 139 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పార్టీల వారీగా చూస్తే… కాంగ్రెస్ 132 స్థానాల్లో ఆధిక్యంతో మూడవ స్థానంలో ఉంది. శివసేన (యుబిటి) 61 స్థానాల్లో ఆధిక్యంతో నాల్గవ స్థానంలో ఉంది, ఆ తర్వాత అజిత్ పవార్ ఎన్‌సిపి (53) ఉంది.

ముంబైతో పాటు, పూణేపై కూడా నిశితంగా దృష్టి సారించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, అతని మామ రాజ్యసభ ఎంపీ శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) మున్సిపల్ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్నాయి. ఇక్కడ కూడా బీజేపీ దూసుకుపోతోంది. పుణెలో కాషాయ పార్టీ 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్సీపీ ఐక్య వర్గాలు నాలుగు స్థానాల్లో వెనుకంజలో ఉన్నాయి.

కాగా, మహారాష్ట్రలోని మొత్త 29 పౌర సంస్థలకు నిన్న పోలింగ్ జరిగింది. ముంబై, పుణెతో పాటుఛత్రపతి శంభాజీనగర్, నవీ ముంబై, వసాయి-విరార్, కళ్యాణ్-డోంబివ్లి, కొల్హాపూర్, నాగ్‌పూర్, సోలాపూర్, అమరావతి, అకోలా, నాసిక్, పింప్రి-చించ్వాడ్, పుణె, ఉల్హాస్‌నగర్, థానే, చంద్రపూర్, పర్భణి, మీరా-భయందర్, నాందేడ్-వాఘాలా, పన్వెల్, భివండి-నిజాంపూర్, లాతూర్, మాలేగావ్, సాంగ్లీ-మిరాజ్-కుప్వాడ్, జలగావ్, అహిల్యానగర్, ధూలే, జల్నా, ఇచల్‌కరణ్జిలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.