Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ట్రంప్ ప్రతిపాదిత గాజా విజన్‌… సమాధులపై నిర్మించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్!

Share It:

దావోస్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అతని అల్లుడు, మిడిల్ ఈస్ట్ సలహాదారు జారెడ్ కుష్నర్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో “ఫ్రీ మార్కెట్ గాజా” విజన్‌ను ప్రదర్శించారు. ఈ విజువల్స్ రియల్ ఎస్టేట్ బ్రోచర్‌ను పోలి ఉండడంతొ తీవ్ర విమర్శలకు గురయ్యాయి

ట్రంప్ “బోర్డ్ ఆఫ్ పీస్” కోసం చార్టర్‌పై సంతకం చేసాక కుష్నర్ మాట్లాడుతూ… ఫ్రీ మార్కెట్ గాజా విజన్‌కు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసమని అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించే మార్గాన్ని కనుగొనడానికి మేము ఇజ్రాయెలీయులతో కలిసి పనిచేస్తున్నాము. తదుపరి దశలో హమాస్‌తో కలిసి పనిచేయడం, వారిని నిరాయుధులుగా చేయడం” అని అన్నారు. భద్రత లేకుండా, ఎవరూ పెట్టుబడులు పెట్టబోరని ఆయన అన్నారు.

కాగా, కుష్నర్ ప్రజెంటేషన్ ఎక్కువగా “అభివృద్ధి చెందిన గాజా” అనే ఆలోచనను అమ్మడంపైనే ఆధారపడింది తప్ప యుద్ధంలో దెబ్బతిన్న నగరాన్ని పునర్నిర్మించేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవు.

ఈ ప్రణాళికలో స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలను అనుసరించేలా వివిధ భవిష్యత్ ప్రాజెక్టు ఆలోచనలు ఉన్నాయి. వాటిలో విమానాశ్రయ నిర్మాణం, “కోస్టల్ టూరిజం”, నివాస ప్రాంతాలను నిర్మించడం.

ఉదాహరణకు, గాజా స్ట్రిప్‌లో రఫా సమీపంలో యాసర్ అరాఫత్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, ఇది 1998లో పాలస్తీనా సార్వభౌమత్వానికి చిహ్నంగా ప్రారంభించారు. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) నాశనం చేయడంతో ఆ తర్వాత విమానాశ్రయం 2001లో కార్యకలాపాలను నిలిపివేసింది.

“మేము స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక సూత్రాలను ఉపయోగించాలనుకుంటున్నాము. అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన దానిలో చాలా వరకు అమెరికాలో ఆయన చేస్తున్నది; గాజా వంటి ప్రదేశానికి మేము అదే మనస్తత్వాన్ని, అదే విధానాన్ని తీసుకురావాలని అనుకుంటున్నామని” కుష్నర్ తన ప్రసంగంలో అన్నారు.

గాజా ప్రజలు “అభివృద్ధి చెందేలా, మంచి జీవితాన్ని గడిపే సామర్థ్యాన్ని” అందించడం ఈ విధానం అని ఆయన పేర్కొన్నారు. అలాగే , “ఫ్రీ మార్కెట్ గాజా” కేంద్ర ప్రాంతాలను పారిశ్రామిక మండలాలుగా, అలాగే నివాస ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. వీటిలో “డేటా సెంటర్లు, అధునాతన తయారీ సౌకర్యాలు” ఉంటాయి. వాణిజ్య మండలాలు, వ్యాపార జిల్లాలు, స్థానిక సంస్థలను ప్రోత్సహించడానికి గ్రాంట్ల కోసం సుమారు US$3 బిలియన్ల మరో పెట్టుబడి నిధిని కేటాయించారు.

“న్యూ రఫా” శీర్షికతో కుష్నర్ సమర్పించిన స్లైడ్ డెక్‌లో…200 కి పైగా విద్యా కేంద్రాలు, 75 వైద్య కేంద్రాలు, 180 సాంస్కృతిక, మతపరమైన, వృత్తిపరమైన కేంద్రాలతో పాటు దక్షిణ నగరంలో 100,000 గృహ యూనిట్లు నిర్మితమవుతాయని రాయబారి సూచించారు.

తన ప్రెజెంటేషన్‌లో 2035 నాటికి గాజా GDP USD 10 బిలియన్లను సాధిస్తుందని, వార్షిక గృహ ఆదాయం USD 13,000 కంటే ఎక్కువగా ఉంటుందని కుష్నర్ అంచనా వేశారు.

“మధ్యప్రాచ్యంలో వారు ఇలాంటి నగరాలను … మూడు సంవత్సరాలలో నిర్మిస్తారు” అని అక్టోబర్ నుండి అమలులో ఉన్న కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో సహాయపడిన కుష్నర్ అన్నారు. “”కాబట్టి, మనం అలా చేస్తే, ఇలాంటివి సాధ్యమేనని అన్నారు.”

కాగా, ఈ కొత్త విజన్‌…ఐక్యరాజ్యసమితి, పాలస్తీనియన్ల అంచనాలకు భిన్నంగా ఉంటుంది. వారు గాజా పునరావాసం చాలా సుదీర్ఘమైన ప్రక్రియగా భావిస్తారు. మరోవంక సుమారు 2 మిలియన్ల జనాభా ఉన్న గాజా ప్రాంతంలో… పాత అపార్ట్‌మెంట్ భవనాలు… శిథిలాల కుప్పలుగా మారాయి. ఇక ఆ శిథిలాల కింద పేలని బాంబులు దాగి ఉన్నాయి. మురుగునీరు వ్యాధులను వ్యాపింపజేస్తోంది. నగర వీధులు మురికి గుంటలను పోలి ఉంటాయి. శిథిలాల తొలగింపు, కూల్చివేత పనులు ఇప్పటికే జరుగుతున్నాయని కుష్నర్ అన్నారు, కానీ మందుపాతరల తొలగింపు కూడా జరుగుతుందో లేదో ఆయన చెప్పలేదు.

గాజా స్థానికులు చౌక కార్మికులుగా మార్చేందుకు ఈ ప్రణాళిక ఉపయోగపడుతుంది: విమర్శకులు
“ఫ్రీ మార్కెట్ గాజా” విషయమై పాలస్తీనియన్-అమెరికన్ రచయిత్రి సుసాన్ అబుల్హావా మాట్లాడుత… ఈ ప్రణాళిక “గాజా అసలు స్వభావాన్ని చెరిపివేయడానికి, వారి ‘పారిశ్రామిక మండలాలను’ నిర్వహించడానికి అతి చౌకైన శ్రామిక శక్తిగా మార్చడం, ‘పర్యాటక’ కోసం ప్రత్యేకమైన తీరప్రాంతాన్ని సృష్టించడానికి” ప్రయత్నించిందని అన్నారు.

https://x.com/susanabulhawa/status/2014335728612782179?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2014335728612782179%7Ctwgr%5Ef587615e74429eca1a68f5c9ee3f570edac53cc7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.siasat.com%2Ftrumps-new-gaza-vision-is-a-real-estate-project-built-on-graves-3330190%2F

దక్షిణాఫ్రికా జాతీయ అసెంబ్లీ కార్యకర్త, మాజీ సభ్యుడు ఆండ్రూ ఫెయిన్‌స్టెయిన్ దీనిని “సమాధుల”పై నగరాన్ని నిర్మించడంతో పోల్చారు. “ఆష్విట్జ్ లేదా థెరిసియన్‌స్టాడ్ శిథిలాలపై రిసార్ట్‌లతో కూడిన మెరిసే నగరం కోసం అమెరికా అధ్యక్షుడి అల్లుడు గాజా విజన్‌ను తీసుకొచ్చారు. అక్కడ నా తల్లి కుటుంబం తరుపు వారు డజన్ల మంది, పదివేల మంది ఇతరులను వధించారు. ఈ ప్రణాళిక నుండి కుష్నర్‌ వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుతాడు,” అని అతను Xలో పోస్ట్ చేశాడు, దానిని అసహ్యకరమైనది, అమానుషమైనదిగా పేర్కొన్నాడు.

https://x.com/andrewfeinstein/status/2014453473459503358?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2014453473459503358%7Ctwgr%5Ef587615e74429eca1a68f5c9ee3f570edac53cc7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.siasat.com%2Ftrumps-new-gaza-vision-is-a-real-estate-project-built-on-graves-3330190%2F

కుష్నర్ ప్రణాళికలో పాలస్తీనియన్లు ఈలోగా ఏమి చేస్తారనే దాని గురించి ప్రస్తావించలేదు.

గాజా పునర్నిర్మాణం కోసం తన ప్రణాళికను ఆవిష్కరించేటప్పుడు, కుష్నర్ మందుపాతర తొలగింపు ఎలా నిర్వహిస్తారో పేర్కొనలేదు. అంతేకాదు తమ పొరుగు ప్రాంతాలు పునర్నిర్మాణం సందర్భంగా గాజా ప్రజలు ఎక్కడ నివసిస్తారో పేర్కొనలేదు. కాగా, ప్రస్తుతం చాలా కుటుంబాలు గాజా నగరంలోని కొన్ని ప్రాంతాలు, గాజా తీరప్రాంతంలో ఎక్కువ భాగం ఉన్న ఒక ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నాయి.

ఇజ్రాయెల్ దీనికి ఎప్పుడైనా అంగీకరిస్తుందా?

ఈ సందర్భంగా అంతర్జాతీయ న్యాయవాది నోమి బార్ మాట్లాడుతూ… గాజాను తిరిగి అభివృద్ధి చేయడానికి ప్రకటించిన గాజా విజన్‌ “పూర్తిగా అవాస్తవికం” అని, ట్రంప్ దానిని శాంతికర్త దృక్కోణం నుండి కాకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్ దృక్కోణం నుండి చూస్తారని ఆయన పేర్కొన్నారు.

జెనీవా సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీలో అసోసియేట్ ఫెలో అయిన బార్-యాకోవ్ మాట్లాడుతూ… చాలా ఎత్తైన భవనాలతో కూడిన ప్రాజెక్ట్ ఇజ్రాయెల్‌కు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి సరిహద్దుకు సమీపంలో ఉన్న దాని సైనిక స్థావరాల స్పష్టమైన వీక్షణను అందిస్తుందని యాకోవ్ అన్నారు.

అంతేకాదు కుష్నర్ ప్రజెంటేషన్ ప్రకారం… గాజా పరిపాలన జాతీయ కమిటీ (NCAG) సంస్కరణలు చేసిన తర్వాత గాజా పర్యవేక్షణను పాలస్తీనా అథారిటీకి అప్పగిస్తుంది. కానీ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధానంతర గాజా కోసం పాలస్తీనా అథారిటీతో సంబంధం ఉన్న ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.