Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఇరాన్‌పై సైనిక చర్య అవసరం రాదని ఆశిస్తున్నాను…ట్రంప్!

Share It:

వాషింగ్టన్‌: ఇరాన్‌పై సైనిక చర్యను నివారించాలని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అన్నారు. అణు ఒప్పందం కుదుర్చుకునేలా టెహ్రాన్‌తో మరిన్ని చర్చలు జరపాలని తాను యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.

“నా మొదటి పదవీకాలంలో నేను సైన్యాన్ని బలోపేతం చేశాను. ఇప్పుడు ఇరాన్ అనే ప్రదేశానికి ఒక బృందం బయలుదేరి వెళ్తోంది. ఆ సైన్యాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాదని ఆశిస్తున్నాను” అని తన భార్య మెలానియా గురించిన ఒక డాక్యుమెంటరీ ప్రీమియర్ సందర్భంగా ట్రంప్ విలేకరులతో అన్నారు.

ఇరాన్‌తో చర్చలు జరుపుతారా అని అడిగినప్పుడు, ట్రంప్ మాట్లాడుతూ… “నేను చర్చలు జరిపాను, జరపాలని యోచిస్తున్నాను. అవును, ప్రస్తుతం చాలా శక్తివంతమైన మా నౌకలు ఇరాన్ వైపు ప్రయాణిస్తున్నాయి, వాటిని ఉపయోగించాల్సిన అవసరం రాకపోతే చాలా బాగుంటుందని ట్రంప్‌ అన్నారు.”

ఒకవేళ ఇరాన్ చర్చలకు రాకపోతే గతంలో కంటే భీకరస్థాయిలో దాడులు చేస్తాం.. నాశనం తప్పదని హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమను యుద్ధం దిశగా నెడితే.. గతంలో ఎన్నడూ చేయని స్థాయిలో దాడి చేస్తామంది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అమెరికా దాడి నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ నిమగ్నమైంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.