Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఛత్తీస్‌గఢ్‌లో ఘర్షణలు… ముస్లింల ఇళ్లు ధ్వంసం!

Share It:

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా… దుట్కైయా గ్రామంలో ఘర్షణలు చెలరేగిన తరువాత పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ఫలితంగా ముస్లింల ఇళ్లను దహనం చేయడంతో సహా అనేక మంది గాయపడ్డారు. పోలీసు సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. కనీసం 10 ఇళ్లకు నిప్పంటించారు, మూడు నుండి నాలుగు వాహనాలను తగలబెట్టారు. కాగా, పోలీసులు ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.

పోలీసు నివేదికల ప్రకారం…రెండేళ్ల క్రితం ఒక గ్రామంలోని ఆలయాన్ని ధ్వంసం చేశాడని ఆరోపణలు ఉన్న వ్యక్తి బెయిల్‌పై జైలు నుండి విడుదలయ్యాడని స్థానికులు తెలిపారు. గ్రామానికి తిరిగి వచ్చిన వెంటనే, అతను తనపై గతంలో ఫిర్యాదు చేసినవారిపై దాడి చేశాడని, ఇది కొత్త ఘర్షణను రేకెత్తించింది. రిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంతమంది స్థానికులు ఆ వ్యక్తులు ఇతర గ్రామస్తులపై రాడ్లు, ,రాళ్లతో దాడి చేశారని, దీని ఫలితంగా కనీసం ఆరుగురు గాయపడ్డారని ఆరోపించారు.

అయితే ముస్లిం స్థానికుల ప్రకారం…పరిస్థితి ఊహించిన దానికంటే దారుణంగా ఉంది. ముస్లింలకు చెందిన ఇళ్ళు తగలబెట్టారని, ముస్లిం కుటుంబాలు భయంతో పారిపోయాయని వారు ఆరోపించారు. అనేక ఇళ్ళు, వాహనాలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ఆ

పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేసరికి, వారిపై రాళ్ళు రువ్వడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పరిస్థితిని నియంత్రించడానికి బెటాలియన్ యూనిట్లు,అదనపు పోలీసు బలగాలను పిలిపించారు. హింసకు సంబంధించి అరెస్టులు జరిగాయని పోలీసు సూపరింటెండెంట్ వేదవ్రత్ సిరామౌర్ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని కూడా ఆయన ధృవీకరించారు.

కాగా, అధికారుల చర్యలపై ముస్లిం సమాజ సభ్యులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వారు అరెస్టులను ప్రశ్నించారు. చర్య ఏకపక్షంగా కనిపిస్తుందని, ఘర్షణల సమయంలో భయం, ఆస్తి నష్టం మధ్య మొత్తం ముస్లిం సమాజం ముప్పును ఎదుర్కొంటుందని చెప్పారు. మొత్తంగా ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని చాలా మంది స్థానికులు సైతం చెబుతున్నారు. గ్రామం అంతటా భారీ పోలీసు మోహరింపు మధ్య దర్యాప్తు కొనసాగుతుండగా… అందరి దృష్టి అధికారులు, వారి తదుపరి చర్యపై ఉంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.