న్యూయార్క్: ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో పెద్ద ఎత్తున పాలస్తీనియన్ల బహిష్కరణ కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సెటిలర్లు వారిపై హింసకు పాల్పడుతున్నారు. ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఈ ఏడాది 2026 ప్రారంభం నుండి ఇప్పటిదాకా 900 మందికి పైగా పాలస్తీనియన్లు తమ ఇళ్ల నుండి బలవంతంగా వెళ్లగొట్టారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
ఈమేరకు UN ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మాట్లాడుతూ… “2026 ప్రారంభం నుండి పెద్ద ఎత్తున నిరాశ్రయులవుతున్నారు. 900 మందికి పైగా పాలస్తీనియన్లు ఇజ్రాయెలీ సెటిలర్లు వెళ్లగొట్టారని ఆయన అన్నారు.
“కేవలం రెండువారాల్లో…ఇజ్రాయెలీ సెటిలర్లు ఈ జనవరి 20 నుండి సోమవారం వరకు, OCHA 50 కంటే ఎక్కువ దాడులను నమోదు చేసింది, దీని ఫలితంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం లేదా రెండు సంభవించాయి” అని డుజారిక్ అన్నారు.
ఇజ్రాయెల్ ముట్టడిలో ఉన్న గాజాలో క్షీణిస్తున్న మానవతా పరిస్థితిని కూడా ఆయన హైలైట్ చేశారు, ఇక్కడ ప్రాణనష్టం కొనసాగుతోంది. ఆరోగ్య అధికారుల ప్రకారం… “గత 24 గంటలలోపు మరణాలు, గాయాలు సంభవించాయని వారు నివేదించారు. ఈనేపథ్యంలో పౌరులు, మౌలిక సదుపాయాలను రక్షించడానికి అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం అన్ని పార్టీలు తమ బాధ్యతలను నెరవేర్చాలి” అని డుజారిక్ జోడించారు.
మొత్తంగా అక్రమిత వెస్ట్‌బ్యాంకులో పాలస్తీనియన్లపై ఇజ్రాయెలీ సెటిలర్ల దాడులు కొనసాగుతున్నాయని, జీవనోపాధిని నాశనం చేస్తున్నాయని, సమాజాలను నిర్మూలిస్తున్నాయని లాజారిని హెచ్చరించారు. ప్రపంచం దృష్టి గాజాపై కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో అంతర్జాతీయ మానవతా చట్ట ఉల్లంఘనలు సర్వసాధారణమయ్యాయని, వెంటనే వాటిని పరిష్కరించాలని ఆయన అన్నారు.
మరోవంక రఫా క్రాసింగ్ తెరవడంతో…వైద్య అవసరాల నిమిత్తం ఈజిప్టుకు కనీసం ఎనిమిది మంది రోగులు, 17 మంది సహాయకుల తరలింపుకు సహాయం చేసారని” ప్రపంచ ఆరోగ్య సంస్థ, దాని ప్రతినిధులు తెలిపారు. వైద్య తరలింపుల ఆవశ్యకతను ఆయన మరింత నొక్కి చెప్పారు.
కాగా, “గాజాలో 18,500 మందికి పైగా రోగులకు ప్రత్యేక చికిత్స అవసరం” అని డుజారిక్ అన్నారు, ఆక్రమిత తూర్పు జెరూసలేంతో సహా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌కు రిఫెరల్ మార్గాలను తిరిగి తెరవాలని పిలుపునిచ్చారు.

