కఠ్మండూ: నేపాల్ కొత్త ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆ దేశ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని అరెస్టు చేశారు. గత ఏడాది జరిగిన జెన్‌జీ ఆందోళనలను హింసాత్మకంగా అణచివేశారనే ఆరోపణలపై ఆయన అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. భక్తపూర్‌లోని గుండులో ఉన్న ఆయన నివాసం నుంచి నేపాల్ పోలీసులు ఓలీని అదుపులోకి తీసుకున్నారు. ఓలీతో పాటు, ఆయన మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌ను కూడా అరెస్టు చేశారు.
“మాజీ ప్రధాని, హోం మంత్రి ఇద్దరినీ ఈ ఉదయం అరెస్టు చేశారు, చట్ట ప్రకారం తదుపరి చర్యలు ముందుకు సాగుతాయని” కాఠ్మండు వ్యాలీ పోలీసు ప్రతినిధి ఓం అధికారి ఏఎఫ్‌పీకి తెలిపారు. ఓలీ అరెస్టు జరిగిన కొద్ది నిమిషాలకే, కొత్తగా నియమితులైన హోం వ్యవహారాల మంత్రి సుడాన్ గురుంగ్, “ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి” అని, “చట్టానికి ఎవరూ అతీతులు కారు” అని అన్నారు.
“మేము మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని, పదవీ విరమణ చేస్తున్న హోం మంత్రి రమేష్ లేఖక్‌ను అదుపులోకి తీసుకున్నాము. ఇది ఎవరిపైనా ప్రతీకారం కాదు; ఇది న్యాయానికి నాంది మాత్రమే. ఇప్పుడు దేశం కొత్త దిశను తీసుకుంటుందని నేను నమ్ముతున్నాను,” అని ఆయన Xలో ఒక పోస్ట్‌లో రాశారు.
కాగా, తన అరెస్ట్‌పై ఓలీ స్పందించారు. తనను “కక్షపూరితంగా” అరెస్టు చేశారని అన్నారు. “నేను న్యాయపోరాటం చేస్తాను,” అని ఆయన మీడియాతో అన్నారు.
గత ఏడాది సెప్టెంబర్ 8, 9 తేదీలలో జరిగిన అవినీతి వ్యతిరేక యువజన ఉద్యమంలో కనీసం 19 మంది యువకులతో సహా 70 మందికి పైగా మరణించారు. ఈ ఉద్యమం ఒక చిన్న సోషల్ మీడియా నిషేధంపై ప్రారంభమైనప్పటికీ, ఆర్థిక ఇబ్బందులపై దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఆగ్రహాన్ని కూడా ఇది రగిలించింది. మరుసటి రోజు పార్లమెంటు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడంతో ఈ అశాంతి దేశవ్యాప్తంగా వ్యాపించి, కేపీ ఓలీ ప్రభుత్వం కూలిపోయింది.
నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు ఇతర మంత్రిత్వ శాఖలకు నిలయంగా ఉన్న ‘సింహ దర్బార్’ కార్యాలయ సముదాయంపై, Gen-Z నిరసనల సమయంలో దాడి జరిగింది.
బాలెన్ షా ఎన్నికవడానికి ముందు, నేపాల్ మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయిన సుశీల కార్కి, స్వల్ప కాలం పాటు నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపించారు. తాత్కాలిక నాయకత్వ బాధ్యతలను స్వీకరించేందుకు ఆమె తన పదవీ విరమణ జీవితం నుండి తిరిగి వచ్చారు; నేపాల్ సున్నితమైన ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఆమె పదవీకాలం ఒక ముందడుగా పరిగణించారు.
రాపర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా, ఇటీవల జరిగిన నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన కొద్దికాలానికే, అవినీతి వ్యతిరేక నిరసనల సమయంలో జరిగిన హింసాకాండపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
శుక్రవారం బాలేంద్ర షా అధ్యక్షతన జరిగిన నేపాల్‌లోని నూతన ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశం, ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ తిరుగుబాటు సమయంలో నిర్లక్ష్యం వహించినందుకు ఓలీ, లేఖక్‌లతో సహా బాధ్యులైన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని సిఫార్సు చేసిన ఉన్నత స్థాయి కమిషన్ విచారణ నివేదికను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది.
“కాల్పులు జరపమని ఆదేశం ఉన్నట్లు రుజువు కాలేదు” అని కమిషన్ నివేదిక పేర్కొంది, కానీ “కాల్పులను ఆపడానికి లేదా నియంత్రించడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదు. వారి నిర్లక్ష్యం కారణంగా మైనర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు” అని తెలిపింది.
అప్పటి నేపాల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ చంద్ర కుబేర్ ఖాపుంగ్‌తో సహా అనేక ఇతర ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని విచారణ కమిషన్ సిఫార్సు చేసింది.
#WATCH | Former Nepal Prime Minister KP Sharma Oli taken into custody from his residence in Gundu, Bhaktapur, by Nepal Police.
— ANI (@ANI) March 28, 2026
According to the Kathmandu Post, "he has been arrested in connection with a culpable homicide-related case linked to the alleged suppression of the… pic.twitter.com/S0zrAmPUFV

