Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ప్రపంచం ఓ పెద్ద యుద్ధాన్ని ఎదుర్కోబోతోంది…ఐక్యరాజ్యసమితి అధిపతి!

Share It:

న్యూయార్క్‌: ప్రపంచం ‘ఓ పెద్ద యుద్ధపు అంచున’ ఉందని, అది మధ్యప్రాచ్యాన్ని చుట్టుముట్టి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. ఈమేరకు గురువారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ…శత్రుత్వాన్ని విరమించుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్‌లను కోరారు.

“ఈ యుద్ధం కారణంగా ప్రజలు తీవ్రమైన బాధ అనుభవిస్తున్నారని, ఇప్పటికే ఆర్థిక పరిణామాలు ఆందోళనకరంగా మారాయని, ఈ యుద్ధాన్ని ఆపడానికి ఇదే సరైన సమయమని” గుటెర్రస్‌ అన్నారు.

ఇరాన్ తన పొరుగు దేశాలపై దాడులను ఆపాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. “సంఘర్షణలు వాటంతట అవే ముగియవు,” కానీ “నాయకులు విధ్వంసం కంటే చర్చలను ఎంచుకున్నప్పుడు మాత్రమే ముగుస్తాయి” అని ఆయన నొక్కి చెప్పారు.

ప్రపంచ ఆర్థికపరమైన ప్రమాదాలను గుటెర్రెస్ నొక్కిచెప్పారు. హర్ముజ్ జలసంధికి ప్రస్తుతం ఏర్పడిన అంతరాయం మంచి పరిణామం కాదని ఐక్యరాజ్యసమితి అధిపతి హెచ్చరించారు.

“హర్ముజ్ జలసంధిని మూసివేసినప్పుడు, ప్రపంచంలోని అత్యంత పేదవారు, బలహీనులు ఊపిరి పీల్చుకోలేరు,” అని ఆంటోనియో గుటెర్రస్‌ అన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.