Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

“నోర్ముయ్‌”…ఇజ్రాయెల్ రాయబారి, ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి మధ్య వాగ్వాదం!

Share It:

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఒక బహిరంగ విచారణలో ఇజ్రాయెల్ రాయబారి, ఐరాస సాయుధ సంఘర్షణల ప్రత్యేక ప్రతినిధి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరగడంతో దౌత్య మర్యాదలు దెబ్బతిన్నాయి. కాగా, యుద్ధాలలో లైంగిక హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లో జరిగిన ఒక సమావేశంలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డనోన్, యూఎన్ మీద పక్షపాత ఆరోపణలు చేసారు.

ఇటువంటి ఆరోపిత దుర్వినియోగాల కారణంగా ఇజ్రాయెల్‌ను మొదటిసారిగా బ్లాక్‌లిస్ట్ చేసిన నివేదికను రూపొందించిన ప్రమీలా ప్యాటెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేసమయంలో ఐక్యరాజ్యసమితి అధిపతి ఆంటోనియో గుటెర్రెస్‌ను ఉద్దేశించి, “ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకోవాలన్న సెక్రటరీ-జనరల్ వ్యామోహానికి మీరు లొంగిపోయారు” అని డానోన్ అన్నారు.

డానన్ వ్యాఖ్యల మధ్యలో చిన్నారులు, సాయుధ ఘర్షణల అంశాలపై ఐరాస ప్రతినిధిగా ఉన్న వానెస్సా జియర్ జోక్యం చేసుకున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ ధ్రువీకరించిన ఆధారాల ఆధారంగానే నమోదు చేశామని చెప్పారు. దీనికి ఆగ్రహించిన డానన్..”మాది ఒక సభ్య దేశం, మీరు ఐక్యరాజ్యసమితి కోసం పనిచేస్తున్నారు, కాబట్టి మీరు ఇప్పుడు నోర్మూసుకోవాలి. లేదంటే బయటకు పోండి. మీ నివేదిక సిగ్గుచేటు” అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అసలు వివాదానికి కారణమేంటంటే…ఇటీవల ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన రెండు కీలక నివేదికల్లో ఇజ్రాయెల్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చింది. సాయుధ ఘర్షణల సమయంలో లైంగిక హింస, అలాగే చిన్నారులపై జరుగుతున్న ఉల్లంఘనలకు సంబంధించి ఇజ్రాయెల్ పై తొలిసారిగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, గాజా యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా చిన్నారులపై ఉల్లంఘనలు గణనీయంగా పెరిగాయని ఐరాస పేర్కొంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు శత్రువైన హమాస్ కూడా…ఈ బ్లాక్ లిస్టులో కొనసాగుతోంది. ఈ నివేదికలు వెలువడినప్పటి నుంచే ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియో గుట్రెస్… ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నారని.. ప్రమీలా పాటెన్ కూడా అదే వైఖరికి లొంగిపోయారని ఆరోపించారు. అంతేకాదు, ఆమె తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.

పాలస్తీనా పిల్లలపై ఉల్లంఘనలు “దిగ్భ్రాంతికరంగా” పెరిగాయని ఐక్యరాజ్యసమితి అధిపతి ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో, పిల్లలపై ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ సెటిలర్ గ్రూపులను ప్రపంచ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చవచ్చని హెచ్చరిస్తూ, మాల్టా మాజీ ఐక్యరాజ్యసమితి రాయబారి అయిన ఫ్రేజియర్, గుటెర్రెస్ తరపున ఈ వారం తన నివేదికను విడుదల చేశారు.

ఆరోపిత ఉల్లంఘనలకు గాను, ఆ నివేదికలోని “సిగ్గుచేటైన జాబితా” అని పేర్కొన్న అనుబంధాలలో ఇజ్రాయెల్ పేరు ఇప్పటికే ఉంది. గత నెలలో పాటెన్ నివేదిక జారీ అయినప్పుడు, డానన్ దానిని “ఒక కొత్త పతనం” అని అభివర్ణించారు. ఈ ఏడాది చివరిలో 10 సంవత్సరాల తర్వాత పదవిని వీడుతున్న గుటెర్రెస్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిజ్ఞ చేసింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.