హైదరాబాద్: సభలో నినాదాలు చేస్తూ ‘వెల్’ (సభ మధ్య భాగం) లోకి దూసుకెళ్లి కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో 20 మంది BRS సభ్యులను ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. వీరిలో కేటీ రామారావు, హరీష్ రావు, అనిల్ యాదవ్, జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కోవా లక్ష్మి, కోనిగంటి మాణిక్ రావు, చింతా ప్రభాకర్, ప్రభాకర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానంద తదితరులు ఉన్నారు.
సభ ప్రారంభమైన వెంటనే, సభ మధ్యలోకి (వెల్) వచ్చిన BRS సభ్యులు ‘మాకు న్యాయం కావాలి’ అంటూ నినాదాలు చేశారు. రెండు రోజుల క్రితం పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు,BRS అధినేత కే చంద్రశేఖర రావు మరణాన్ని కోరుతూ అధికార కాంగ్రెస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరపాలని కోరుతూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వాయిదా తీర్మానాన్ని (adjournment motion) ప్రతిపాదించారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు పదేపదే కోరినప్పటికీ, BRS సభ్యులు తమ స్థానాలకు తిరిగి వెళ్లడానికి నిరాకరించారు.
కేసీఆర్ ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించాలని తాను, ఇతర కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నట్లు విక్రమార్క పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు సజావుగా జరగనివ్వాలని.. ప్రతీ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని మంత్రులు శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశాలకు అంతరాయం కలిగించారు.
సమావేశాలకు అడ్డుపడుతోన్న బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ తీర్మానాన్ని ఆమోదించి బీఆర్ఎస్ సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.
