హైదరాబాద్: ఒక నార్వేజియన్ మహిళా జర్నలిస్ట్‌కు భారతదేశంలోకి ప్రవేశించడానికి వీసా నిరాకరించడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, ప్రెస్ ఫ్రీడమ్‌కు (పత్రికా స్వేచ్ఛకు) సంబంధించి హెల్ లింగ్ (Helle Lyng) అనే నార్వేజియన్ జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమిట్‌లో ప్రసంగించేందుకు ఆమెకు ఆహ్వానం లభించగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమెకు వీసా నిరాకరించింది.
సదస్సుకు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ… “మోదీజీని ప్రశ్నలు అడగడం నేరమా? ప్రశ్నలు అడగడం ఒక జర్నలిస్ట్ బాధ్యత. వాటికి సమాధానం చెప్పాలా వద్దా అనేది మోదీజీ ఇష్టం” అని అన్నారు.
అధికారికంగా వీసాలు మంజూరైనప్పటికీ, కొందరు విదేశీ జర్నలిస్టులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) భారతదేశానికి రాకుండా అడ్డుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.”ప్రశ్నలు అడిగిన వారిని రాకుండా ఆపారు. ఎందుకంటే మోదీకి నిరంకుశత్వం అంటే ఇష్టం. ఆయన తనను తాను ఒక నియంతగా భావించుకుంటారు” అని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రిని సూటిగా ప్రశ్నిస్తూ… “మా ప్రశ్న ఇదే — ఎవరో ఒక ప్రశ్న అడిగినంత మాత్రాన మోదీజీ ఎన్నికల్లో ఓడిపోతారా?” అని నిలదీశారు.
ఈ వివాదం నేపథ్యంలో, మీడియా స్వేచ్ఛపై మాట్లాడటానికి ఆహ్వానించిన నార్వే జర్నలిస్ట్ హెలె లింగ్ స్వెండ్సెన్ తాను బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు భారతదేశానికి రావద్దని హెచ్చరికలు అందుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతించిన 315 మంది వక్తలలో 115 మందికి, హోం శాఖ ఆదేశాల మేరకు వీసాలు రద్దు చేశారని ఆరోపించారు. అయితే, దీనిపై కేంద్రం నుంచి అధికారికంగా ఎలాంటి వివరణ వెలువడలేదు.
వివాదాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రపంచ సవాళ్లు, విధాన సహకారంపై చర్చలకు ‘భారత్ సమ్మిట్’ను ఒక ప్రముఖ అంతర్జాతీయ వేదికగా నిలపాలని తాము ఆశిస్తున్నట్లు సీఎం తెలిపారు. నవంబర్ 13, 14 తేదీలలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు 70 దేశాల నుంచి సుమారు 1,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
కాగా, నేడు జరిగే ముగింపు కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హానున్నారు. ఈ వేదికగా తెలంగాణ గిగ్ వర్కర్స్ విధానాన్ని కార్మికులకు అంకితం చేస్తూ రాహుల్ గాంధీ భారతదేశ సందేశాన్ని ప్రపంచానికి ఇస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మార్చిలో ప్రత్యేక బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.
कुछ पत्रकारों को Visa मिला लेकिन उसके बाद भी MHA ने उन्हें भारत आने से मना कर दिया।
— Congress (@INCIndia) November 13, 2026
मोदी जी से सवाल पूछना गुनाह है क्या? पत्रकारों की जिम्मेदारी है सवाल पूछना। जवाब देना है या नहीं यह मोदी जी की इच्छा है।
लेकिन जिसने सवाल पूछा, उनको हिंदुस्तान में आने के लिए मना कर दिया… pic.twitter.com/D31Lv8V9Az
