న్యూఢిల్లీ: ముస్లిం వ్యతిరేక, ద్వేషపూరిత ప్రసంగాలకు పెట్టింది పేరైన మహంత్ యతి నర్సింఘానంద్ మరోసారి నోరుపారేసుకున్నారు. నాలుగు ప్రముఖ ఇస్లామిక్ విద్యా సంస్థలైన “అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా, దారుల్ ఉలూమ్, దేవ్‌బంద్‌లను నాశనం చేయడానికి సైనిక చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఉగ్రవాద స్థావరాలను సైన్యాన్ని పంపించి ఫిరంగులతో పేల్చివేయాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
https://www.instagram.com/reel/DQ_QjM2CUCo/?igsh=MTdweHp1aG1raTM2ZQ==
ఇక నవంబర్ 10న జరిగిన ఢిల్లీ ఎర్రకోట పేలుడుకు సంబంధించి ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు వైద్యులను అరెస్టు చేసిన తర్వాత మహంత్ యతి నర్సింగ్‌హానంద్ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
ఈ పేలుళ్లలో మరణించిన “ఉగ్రవాదుల” పట్ల అల్ ఫలా యూనివర్సిటీ సంతాపం వ్యక్తం చేస్తున్నారని నర్సింఘానంద్ ఆరోపించాడు. “జిహాదీలతో” ఘర్షణలు ఉన్నప్పటికీ హిందువులు వారిని విడిచిపెట్టారని విమర్శించాడు. “వారు అన్ని పరిస్థితులలోనూ తమ ప్రజలకు అండగా నిలుస్తారు – అందుకే వారికి 57 దేశాలు ఉన్నాయి. కానీ మీరు మీ కోసం పోరాడే వారిని వదిలివేస్తారు” అని ఆయన అన్నారు. “యోధులకు” మద్దతు ఇవ్వాలి లేదంటే అంతరించిపోయే ప్రమాదం ఉంది అని హిందువులను కోరారు.”
“ఇది నా జీవితంలో చివరి దశ” అని ఆయన జోడించారు. “ఈ సంస్థలను ఫిరంగులతో నాశనం చేయమని మీ నాయకులపై ఒత్తిడి తెండి, లేకుంటే తప్పించుకునే అవకాశం ఉండదు అని మహంత్ యతి నర్సింఘానంద్ అన్నారు.”
కాగా, మహంత్ వ్యాఖ్యలు… పేలుళ్ల తర్వాత ఆన్‌లైన్‌లో ఇస్లామోఫోబిక్, జాతి విద్వేషాన్ని మరింత పెంచింది. ముస్లిం సంస్థలపై హింసకు బెదిరింపులు… అనామక ఖాతాల ద్వారా మాత్రమే కాకుండా, ప్రముఖ హిందూత్వ నాయకులు, ప్రధాన స్రవంతి జర్నలిస్టుల ద్వారా కూడా ప్రచారమవుతున్నాయి.
ఇటువంటి ప్రసంగాలు హింసను సాధారణీకరిస్తాయని, మతపరమైన అశాంతికి దారితీసే ప్రమాదాన్ని కలిగిస్తాయని హక్కుల సంఘాలు హెచ్చరించాయి. అసలు ద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు గతంలో అనేక FIRలలో నమోదైనా…మహంత్ యతి నర్సింఘానంద్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, అతడిని శిక్షించలేదు.
మరోవంక ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు కొనసాగటం…ఇటు విద్వేష వ్యాఖ్యలు తీవ్రతరం అవడంతో మతపరమైన విభజన జరిగిపోయింది. మైనారిటీ సంస్థలు ఇప్పుడు బహిరంగ చర్చలో లక్ష్యంగా మారాయి.


