Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

మూడవ తరగతి పాఠాన్ని ‘లవ్ జిహాద్’గా చిత్రీకరించిన టీవీ ఛానళ్లకు మందలింపు!

Share It:

న్యూఢిల్లీ: ఎన్‌సీఆర్‌టీ పుస్తకంలోని మూడవ తరగతి పాఠాన్ని కల్పిత ‘లవ్ జిహాద్’ కథనంగా మార్చినందుకు పలు టీవీ ఛానెల్‌లను న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (NBDSA) మందలించింది. ఆ మతపరమైన ప్రసారాన్ని వెంటనే తొలగించాలని కూడా ఆదేశించింది.

కాగా, ఈ కథనాన్ని ఇండియా టీవీ, న్యూస్ 18 మధ్యప్రదేశ్/ఛత్తీస్‌గఢ్, జీ మధ్యప్రదేశ్/ఛత్తీస్‌గఢ్, జీ న్యూస్, ABP న్యూస్ వార్తా ఛానెల్‌లు ప్రసారం చేసాయి.

విషయంలోకి వస్తే…రీనా అనే అమ్మాయి “చిట్టి ఆయి హై” అనే పిల్లల పర్యావరణ అధ్యయన పాఠంలో అహ్మద్‌కు రాసిన లేఖకు సంబంధించినది. పాఠ్యపుస్తకంలోని లేఖకు మతపరమైన కోణాన్ని ఉపయోగించి, “లవ్ జిహాద్”కి ఉదాహరణ అని టీవీ ఛానెల్‌లు పేర్కొన్నాయి.

కాగా, ‘లవ్ జిహాద్’ అనేది ఒక కుట్ర సిద్ధాంతం. ఇది ఇస్లామోఫోబియాకు సంబంధించిన విషయం. ప్రేమ, వివాహం నెపంతో ముస్లిం పురుషులు (ఎక్కువగా హిందూ స్త్రీలను) ఇస్లాంలోకి మతం మార్చుకునేలా “ఆకర్షిస్తున్నారని” ఒక ఆరోపణ మాత్రమే.

పర్యావరణ్ కి కితాబ్, నికలా లవ్ జిహాద్ కా చాప్టర్, ‘రీనా నే అహ్మద్ కో… క్యు లిఖా చిట్టి’, స్కూల్ మే లవ్ జిహాద్ వాలీ చిట్టీ వంటి కొన్ని టిక్కర్లు టీవీల్లో ప్రసారమయ్యాయి.

“కేవలం NCERT పాఠ్యపుస్తకంలోని ఒక అధ్యాయంలో, ఒక అమ్మాయి వేరే మతానికి చెందిన అబ్బాయికి లేఖ రాస్తుందని చూపించారు. అది ‘లవ్ జిహాద్’ కాదు” అని అధికార యంత్రాంగం పేర్కొంది.

వార్తా ఛానెల్‌లు తల్లిదండ్రుల ఫిర్యాదును కవర్ చేయడం కంటే ముందుకు వెళ్లి, ఏ విద్యా నిపుణుల నుండి ఇన్‌పుట్ తీసుకోకుండా “(దానిని) ఒక నిర్దిష్ట కథనంతో చర్చగా మార్చాయి… ” అని న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (NBDSA) పేర్కొంది.

కొంతమంది ప్రసారకర్తలు “వారి అభిప్రాయాలు బాగా తెలిసిన” వ్యాఖ్యాతలపై ఎక్కువగా ఆధారపడ్డారని, ఇతర దృక్కోణాలను ప్రదర్శించడంలో విఫలమయ్యారని ఇది పేర్కొంది. సదరు “కార్యక్రమాలను రూపొందించిన విధానం నిష్పాక్షికత పాటించలేదనికూడా NBDSA పేర్కొంది.

న్యూస్18 ఎంపీ/ఛత్తీస్‌గఢ్, ఏబీపీ న్యూస్, జీ ఎంపీ/ఛత్తీస్‌గఢ్, జీ న్యూస్, ఇండియా టీవీ వంటి పలు వార్తా ఛానెల్‌లను వివాదాస్పద వీడియోలను తొలగించాలని అధికార యంత్రాంగం ఆదేశించింది. వారు తమ వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ ఛానెల్‌లు మరియు అన్ని లింక్‌లతో సహా వారి అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుండి వాటిని ఏడు రోజుల్లోపు తొలగించి, వాటి పూర్తి వివరాలను అధికారికంగా అధికారానికి తెలియజేయాలని NBDSA ఆదేశించింది.

కాగా, న్యాయవాదులు ఇంద్రజిత్ ఘోర్పాడే, ఉత్కర్ష్ మిశ్రా ఈ ఫిర్యాదులను దాఖలు చేశారు. ఎనిమిది వార్తా కార్యక్రమాలు కూడా కల్పిత క్లాస్ 3 పాత్రధారి రీనా అహ్మద్‌కు రాసిన లేఖ “లవ్ జిహాద్”కు రుజువు అని నిరాధారంగా ప్రచారం చేశాయని పిటిషన్‌లో పేర్కొంది.

మొత్తంగా ఈ”పాఠ్యాంశాలు, అధ్యాయాలు NCERT నుండి వచ్చాయి. దాని నిర్దిష్ట పనేమిటంటే పాఠశాల విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేయడం. భారతదేశం ఒక లౌకిక దేశం, ఇది రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి. అందువల్ల, NCERT పుస్తకంలోని ఒక నిర్దిష్ట అధ్యాయం పట్ల ప్రసారకులు చూపే ఈ పక్షపాతం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది.” వార్తా ఛానెల్‌లకు జరిమానా విధించలేదు, కానీ కథనాన్ని ప్రసారం చేసిన తీరును NBDSA తప్పుబట్టింది. సున్నితమైన అంశాలను ప్రసారం చేసేటప్పుడు టీవీ ఛానల్‌లు మతపరమైన కోణంలో ఇరికించడాన్ని నివారించాలని వారు పేర్కొన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.