న్యూఢిల్లీ: దళితులు, ఆదివాసీలు, మైనారిటీల ఓటు హక్కును హరించేందుకు బిజెపి పనిచేస్తోందని, అది పూర్తయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డుదారుల జాబితా నుండి వారి పేర్లను తొలగించి, వారి ఆస్తులను లాక్కుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇది ఎన్నికల సమస్య కాదు, కాంగ్రెస్ సమస్య కాదు, దేశవ్యాప్త సమస్య. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడేందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలను ఎదుర్కోవడానికి వీలుగా రాహుల్ గాంధీ చేపట్టిన ఈ పోరాటానికి దేశమంతా కలిసి రావాలని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని రేవంత్ రెడ్డి అన్నారు.
దేశ రాజధానిలోని రాంలీలా మైదానంలో జరిగిన ‘ఓటు చోర్, గద్దీ ఛోడ్’ ర్యాలీలో ప్రసంగించిన రేవంత్‌రెడ్డి, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు ఓటు హక్కు ఇవ్వాలని ఆర్‌ఎస్‌ఎస్ కోరుకోలేదని, కానీ మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ పేదలకు ఓటు హక్కు ఇవ్వాలని కోరుకున్నారని పేర్కొన్నారు.
“గోల్వాల్కర్ సిద్ధాంతంపై ఏర్పడిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ భావజాలాన్ని విధించాలనుకుంటోంది. అందుకే వారు 400 సీట్లు కోరుకున్నారు కానీ 240 సీట్లవద్దే ఆగిపోయారు. అందుకే రిజర్వేషన్, రాజ్యాంగం కాపాడుకున్నామని సీఎం రేవంత్ అన్నారు. “రాహుల్ జీ, ఖర్గే జీ… ఆర్‌ఎస్‌ఎస్ గోవల్కర్ మోడీ-షాను ఎదుర్కోవాలనే ఆలోచనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు” అని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ మహా ధర్నా ద్వారా కాంగ్రెస్ పార్టీ, భాజపా-కేంద్ర ప్రభుత్వాలపై ‘ఓటు దొంగతనాలు’, ‘సామాజిక న్యాయం ఉల్లంఘనలు’పై తీవ్రంగా ఆక్షేపించింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, విపక్షనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వద్రా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యి పోరాటానికి బలమైన మద్దతు తెలిపారు.
After taking away voter id card, you’ll lose Aadhar card, ration and eventually your land & assets – CM Revanth Reddy at Vote Chor Gaddi Chhod Rally at Ramleela Maidan pic.twitter.com/yECr02ATPl
— Naveena (@TheNaveena) December 14, 2025


