న్యూఢిల్లీ: తమ దేశంలో మైనారిటీల హింసపై… భారతదేశం చేస్తున్న విమర్శలు వాస్తవాలను ప్రతిబింబించవని ఢాకా పేర్కొంది. భారతదేశంలోని కొన్ని వర్గాలు “బంగ్లాదేశ్ వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి హిందువులపై క్రమబద్ధమైన హింసలో భాగంగా ఏవో ఒకటి ఆరా సంఘటనలను తప్పుగా చిత్రీకరిస్తున్నాయని ఆ దేశ ప్రభుత్వం ఆరోపించింది.
బంగ్లాదేశ్‌లో చేనేత కార్మికుడు దీపు దాస్ హత్య తర్వాత తెరపైకి వచ్చిన రెండు వైపులా వివాదం మరింత తీవ్రతరం చేస్తున్నప్పటికీ, బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాది హత్యలో ఇద్దరు కీలక నిందితులు భారతదేశానికి పారిపోయారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ప్రకటించారు. అంతకుముందు, వారు సరిహద్దు దాటి పారిపోయారనే ఊహాగానాలు దేశంలో భారత వ్యతిరేక భావాన్ని రేకెత్తించాయి.
బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ… భారతదేశ విమర్శలను గమనించింది, కానీ అవి “వాస్తవాలను ప్రతిబింబించడం లేదు” అని పేర్కొంది. “బంగ్లాదేశ్‌లో ధీర్ఘకాలంగా కొనసాగుతున్న మత సామరస్య సంప్రదాయాన్ని తప్పుగా సూచించే కథనాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని” ఒక ప్రకటనలో తెలిపింది.
“సాధారణ భారతీయులను… బంగ్లాదేశ్, దాని దౌత్య కార్యకలాపాలు, ఇతర సంస్థలపై రెచ్చగొట్టడానికి” ఉపయోగిస్తున్న తీరును మేము గమనించాము” అని ఢాకా ఆరోపించింది.
బంగ్లాదేశ్‌లో రెండవ హిందూ వ్యక్తి హత్యను ఆ దేశంలోని మైనారిటీల భద్రతకు సంబంధించిన విషయంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నట్లు కూడా గమనించిన ఢాకా, అతని వ్యాఖ్యలు “తప్పుదారి పట్టించేవి” అని అన్నారు.
రాజ్‌బరి ఏరియాలో అమృత్ మండల్ “దురదృష్టకర మరణం” తన ముస్లిం సహచరుడిపై దోపిడీకి పాల్పడుతున్నప్పుడు జరిగింది,ఆ తరువాత అతన్ని అరెస్టు చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. “ఈ నేరపూరిత చర్యను మైనారిటీ ప్రవర్తన కోణం నుండి చిత్రీకరించడం వాస్తవమైనది కాదు, తప్పుదారి పట్టించేది” అని, “భారతదేశంలోని వివిధ వర్గాలకు” “మంచి పొరుగు సంబంధాలను, పరస్పర విశ్వాసాన్ని” దెబ్బతీయవద్దని పిలుపునిచ్చింది.
దాస్, మండల్ హత్యల గురించి అడిగినప్పుడు జైస్వాల్ మాట్లాడుతూ…బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై దాడులు తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం” అని అన్నారు. “కొన్ని వార్తాసంస్థలను” ఉటంకిస్తూ…ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై 2,900 కంటే ఎక్కువ హింస సంఘటనలు నమోదయ్యాయని జైస్వాల్ పేర్కొన్నారు. “ఈ సంఘటనలను కేవలం మీడియా అతిశయోక్తి లేదా రాజకీయ హింసగా తోసిపుచ్చలేము” అని అన్నారు. “బంగ్లాదేశ్‌లోని హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై తీవ్రవాదుల చేతుల్లో నిరంతరాయంగా ఉన్న శత్రుత్వం తీవ్ర ఆందోళన కలిగించే విషయం” అని అన్నారు.
డిసెంబర్ 18న బైక్‌పై వచ్చిన దుండగుడి కాల్పుల్లో విద్యార్థి నేత హాది మరణించిన తర్వాత జరిగిన హింసలో… దాస్‌ను ఒక గుంపు కొట్టి చంపింది. హాదీ హత్య కేసులో నిందితులు భారతదేశానికి పారిపోయారనే ఊహాగానాలు బంగ్లాదేశ్ వీధుల్లో భారత వ్యతిరేక భావాన్ని రెచ్చగొట్టాయి. దీనితో న్యూఢిల్లీ నిరసన వ్యక్తపరిచింది.
ఈ కేసులో ఇద్దరు ‘ప్రాథమిక’ అనుమానితులు మైమెన్‌సింగ్‌లోని హలుఘాట్ సరిహద్దు ద్వారా మేఘాలయకు దాటి, ఆ తర్వాత కొండ రాష్ట్రంలోని తురా పట్టణానికి ప్రయాణించారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ప్రకటించినట్లు డైలీ స్టార్ నివేదించింది. అయితే, వారు ఎప్పుడు భారతదేశానికి పారిపోయారో చెప్పలేదు.
“వారిని అరెస్టు చేసి అప్పగించడానికి మేము అధికారిక మరియు అనధికారిక మార్గాల ద్వారా భారత అధికారులతో కమ్యూనికేషన్ కొనసాగిస్తున్నాము” అని అదనపు కమిషనర్ ఎస్.ఎన్. నజ్రుల్ ఇస్లాం చెప్పినట్లు వార్తాపత్రిక ఉటంకించింది. ‘అనధికారిక నివేదికల’ ప్రకారం భారతదేశంలో అనుమానితుల ప్రయాణానికి సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులను భారత అధికారులు అరెస్టు చేశారని కూడా ఆయన అన్నారు.
భారత అధికారుల నుండి అధికారిక ప్రకటన లేనప్పటికీ, బంగ్లాదేశ్ సహచరుల నుండి తమకు ఎటువంటి సమాచారం అందలేదని ఓ సీనియర్ మేఘాలయ పోలీసు అధికారి చెప్పినట్లు హిందూస్తాన్ టైమ్స్ ఉటంకించింది. “నివేదికలో పేర్కొన్న నిందితులలో ఎవరినీ గారోహిల్స్‌లో గుర్తించలేదు, అరెస్టులు జరగలేదు” అని వారు పత్రికకు తెలిపారు.
“ఈ వ్యక్తులు హలుఘాట్ సెక్టార్ నుండి మేఘాలయలోకి అంతర్జాతీయ సరిహద్దును దాటినట్లు ఎటువంటి ఆధారాలు లేవు … ఈ వాదనలు నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి” అని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ O.P. ఉపాధ్యాయ్ చెప్పినట్లు కూడా ఇది ఉదహరించింది.
మరోవంక, హాది హత్యకు వ్యతిరేకంగా ఆదివారం కూడా ఢాకాలో నిరసనలు కొనసాగాయి. అతని ఇంక్విలాబ్ మోంచో సంస్థకు చెందిన ప్రదర్శనకారులు ఆదివారం రద్దీగా ఉండే షాబాగ్ స్క్వేర్,సిల్హెట్‌లోని చోహట్టా కూడలిని దిగ్బంధించారని డైలీ స్టార్ నివేదించింది. ప్రకటన
హాది హత్యలో పది రోజుల్లోగా దర్యాప్తు అధికారులు చార్జిషీట్ దాఖలు చేస్తారని హోం సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి ఆదివారం తెలిపారు.


