Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్‌!

Share It:

వాషింగ్టన్‌: రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగిస్తున్న భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా హెచ్చరిక జారీ చేశారు. ”ప్రధాని మోడీ మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం ముఖ్యం. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మేము మరిన్ని టారిఫ్‌లను విధిస్తాం” అని పేర్కొన్నారు.

“రష్యా చమురు విషయంలో వారు సహాయం చేయకపోతే, మేము భారతదేశంపై సుంకాలను పెంచవచ్చు,” అని ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో అన్నారు. కాగా, ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్‌తో పాటు ప్రయాణిస్తున్న అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం, ట్రంప్ భారత్‌పై విధించిన సుంకాలే న్యూఢిల్లీ ఇప్పుడు రష్యా నుండి గణనీయంగా తక్కువ చమురు కొనడానికి ‘ప్రధాన కారణం’ అని చెప్పిన తర్వాత కూడా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవంక రష్యా చమురు కొనుగోలు చేసే దేశాల నుండి వచ్చే దిగుమతులపై 500 శాతం పన్నులు విధించాలని కోరుతున్న తన సుంకాల బిల్లు గురించి సైతం అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం మాట్లాడారు.

కాగా, భారత్‌… రష్యా చమురును కొనడం ఆపాలని ట్రంప్‌ మనల్నిపలుమార్లు హెచ్చరించారు. అయితే దాన్ని భారత్ పూర్తి సీరియస్‌గా తీసుకోగా పోగా రష్యా నుంచి చమురు కొనడాన్ని మాత్రం ఆపలేదు. ఇటీవల రష్యా అధ్యక్షడు పుతిన్.. భారత్‌కు వచ్చిన నేపథ్యంలో కూడా చమురు సరఫరాపై మాట్లాడారు.. తాము భారత్‌కు చమురు సరఫరా చేస్తామని కచ్చితంగా చెప్పేశారు. మరొకవైపు చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. ఇలా వరుస పరిణామాలు ట్రంప్‌కు అసహనం తెప్పిస్తున్నాయి.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.