Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

జనవరి 19న దావోస్‌కు సీఎం…భారీ పెట్టుబడులపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ!

Share It:

హైదరాబాద్: తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశానికి హాజరయ్యేందుకు దావోస్‌లో పర్యటించనున్నారు. ఆరు రోజుల పర్యటనలో సీఎం…రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తెలంగాణ పెవిలియన్‌లో ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.

అలాగే ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రైజింగ్ -2047’ విజన్ డాక్యుమెంట్‌ను ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రదర్శించనున్నారు. ఈమేరకు “ఐటీ, పరిశ్రమల విభాగాలు దావోస్‌లో ఉండే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఈ విజన్ డాక్యుమెంట్‌ను వివరించే పనిలో నిమగ్నమై ఉన్నాయని” ఒక అధికారి తెలిపారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం…స్విట్జర్లాండ్ నుండి రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడ ఆయన ప్రముఖ ఐటీ, ఉత్పాదక కంపెనీలతో వ్యాపార సమావేశాలు నిర్వహిస్తారు. ఈ అధికారిక ప్రతినిధి బృందం ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు మరియు లాజిస్టిక్ కంపెనీల ప్రతినిధులను కూడా కలిసి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానిస్తుంది.

అంతేకాదు 2025 దావోస్ సమావేశంలో తెలంగాణ అనేక కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, అవి మొత్తం ఒక లక్షా 78వేల 950 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదించాయి. తద్వారా రాష్ట్రంలో 49వేల 550 ఉద్యోగాలు సృష్టించనున్న విషయం తెలిసిందే. ప్రతిపాదిత వ్యక్తిగత పెట్టుబడులలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ 60వేల కోట్లు, ఆ తర్వాత సన్ పెట్రోకెమికల్స్ నుండి 45వేల కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, మేఘా ఇంజనీరింగ్ సంస్థలు ఒక్కొక్కటి 15వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. WEF-2026 సందర్భంగా రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోందని, ఇందులో సింహభాగం గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగాల నుండి వస్తుందని అధికారులు తెలిపారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.