Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా విశ్వవిద్యాలయంపై ఇజ్రాయెల్ దాడి, 11 మంది విద్యార్థులకు గాయాలు!

Share It:

రమల్లా: ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని బిర్జీట్ విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడింది. ఫలితంగా 11 మంది పాలస్తీనా విద్యార్థులు గాయపడ్డారు, వీరిలో ఐదుగురు తుపాకీ గాయాలయ్యాయి. అంతేకాదు సైనికులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తూ విశ్వవిద్యాలయంలోకి చొరబడ్డారు, దీని ఫలితంగా గ్యాస్ పీల్చడం వల్ల అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

వార్తా సంస్థ WAFA ప్రకారం… పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ మొత్తం గాయపడిన వారిలో ఐదుగురు తుపాకీ కాల్పులకు గురయ్యారు, నలుగురు గ్యాస్ పీల్చడం వల్ల బాధపడ్డారు. దాడి సమయంలో పడిపోవడం వల్ల ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారని విశ్వవిద్యాలయ ప్రజా సంబంధాల అధికారి నిర్దిన్ అల్-మిమి వార్తా సంస్థకు తెలిపారు.

ఇజ్రాయెల్ దళాలు క్యాంపస్ లోపల మందుగుండు సామగ్రిని పేల్చారని, టియర్ గ్యాస్ ప్రయోగించాయని,గ్రెనేడ్లు విసిరాయని కూడా PRO ధృవీకరించింది. దాడి జరిగిన సమయంలో విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో దాదాపు 8,000 మంది విద్యార్థులు ఉన్నారని ఆయన అన్నారు. “సైనికులు విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం పగులగొట్టి లోపలకి ప్రవేశించారు. అధ్యాపకులపై దాడి చేశారు. విద్యార్థుల ఉద్యమానికి చెందిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు” అని అల్-మిమి అన్నారు.

అంతేకాదు విశ్వవిద్యాలయ విద్యా వ్యవహారాల ఉపాధ్యక్షుడు అస్సీమ్ ఖలీల్‌ను దాడి సమయంలో సైన్యం నిర్బంధించింది. పాలస్తీనా విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఈ దాడిని ఖండించింది, ఇది విద్యా సంస్థలను రక్షించే అంతర్జాతీయ నిబంధనలను ఉల్లఘించడమేనని పేర్కొంది.

ఇటువంటి చర్యలు పాలస్తీనా విద్యా సంస్థలు, వాటి విద్యార్థులు లేదా సిబ్బంది సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయవని, ఉల్లంఘనలు ఉన్నప్పటికీ వారు నేర్చుకోవడం, జ్ఞానం పొందాలనే లక్ష్యానికి కట్టుబడి ఉంటారని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. కాగా, పాలస్తీనా ఉన్నత విద్యపై జరుగుతున్న దాడులను ఆపడానికి సహాయం చేయాలని అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సంఘం, అరబ్ విశ్వవిద్యాలయాల సంఘం, మానవ హక్కులు, మీడియా సంస్థలకు పిలుపునిచ్చింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.