Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు!

Share It:

జల్నా: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళా జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పాంగర్కర్ మహారాష్ట్రలోని జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఆయన 13వ వార్డు నుంచి బరిలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థులుగా బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులు ఉన్నారు. అయితే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మాత్రం తమ అభ్యర్థిని నిలబెట్టలేదు.

యాదృచ్ఛికంగా, నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పాంగర్కర్ శివసేనలో చేరారు. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో షిండే పార్టీలో ఆయన చేరికను తాత్కాలికంగా నిలిపివేశారు.

2014 నుండి దేశంలో వచ్చిన రాజకీయ మార్పుల నేపథ్యంలో… లౌకికవాదం, మతతత్వంపై తీవ్ర చర్చకు దారితీసిన ఈ ఘటనలో గౌరీ లంకేష్ సెప్టెంబర్ 5, 2017న కర్ణాటకలోని బెంగళూరులో తన నివాసం వెలుపల కాల్చివేతకు గురయ్యారు.

కాగా, ఈ హత్య కేసు నిందితుడైన పాంగర్కర్ 2001- 2006 మధ్య అవిభక్త శివసేన తరపున జల్నా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. 2011లో శివసేన టికెట్ నిరాకరించడంతో ఆయన హిందూ జనజాగృతి సమితి అనే మితవాద సంస్థలో చేరారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ముడి బాంబులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న కేసులో మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అతన్ని ఆగస్టు 2018లో అరెస్టు చేసింది. ఆ సమయంలో పాంగర్కర్‌పై పేలుడు పదార్థాల చట్టం, పేలుడు పదార్థాల నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద కేసులు నమోదు చేశారు. మరోవంక గౌరీ లంకేష్ హత్య కేసులో కర్ణాటక హైకోర్టు సెప్టెంబర్ 4, 2024న అతనికి బెయిల్ మంజూరు చేసింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.