Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు!

Share It:

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. తదనంతరం భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు.

కాగా, రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని… దేశ అభివృద్ధి ప్రస్తానమైన సాంస్కృతిక గొప్పతనం, ఆర్థిక పురోగతి, సైనిక బలాన్ని మన దేశం అద్భుతంగా ప్రదర్శించింది, ఇందులో క్షిపణులు, ఫైటర్ జెట్‌లు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉపయోగించిన అధునాతన ఆయుధాలు ఉన్నాయి.

గణతంత్ర వేడుకలకు ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లేయెన్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

కోస్టా, వాన్ డెర్ లేయన్‌లతో కలిసి సాంప్రదాయ గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్తవ్య పథ్‌కు చేరుకున్న తర్వాత కవాతు ప్రారంభమైంది.

రిపబ్లిక్ డే పరేడ్‌కు ఉపరాష్ట్రపతి రాధా కృష్టన్‌తో సహా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, అగ్రశ్రేణి సైనిక నాయకులు, దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి హాజరయ్యారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.