హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించడంలో మరోసారి విఫలమైందని ఆరోపించారు.
తెలంగాణ కేంద్రానికి గణనీయమైన పన్ను ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ, రాష్ట్రానికి సున్నా కేటాయింపు చేసిందని అన్నారు. “మేము లక్షల కోట్ల పన్నులు చెల్లిస్తాము, కానీ వనరుల కేటాయింపులో తెలంగాణను పూర్తిగా విస్మరించారు” అని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ పట్ల వివక్షతతో కూడిన వైఖరిని ఆయన ఖండించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం పక్షపాత విధానాన్ని అవలంబిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రతిసారీ అన్యాయం జరుగుతోందని, దీనిపై బీజేపీ… తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

