Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

అస్సాం ఓటర్ల జాబితా ప్రచురణ…2.43 లక్షల మంది తొలగింపు!

Share It:

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం (ECI) ఫిబ్రవరి 10న అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎస్‌ఐఆర్‌-2026 తుది ఓటర్ల జాబితాను ప్రచురించింది. మొత్తం నమోదైన ఓటర్ల సంఖ్య 2,49,58,139.

అధికారిక డేటా ప్రకారం… తుది జాబితా ముసాయిదా జాబితాతో పోలిస్తే నికరంగా 2,43,485 ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. సవరించిన జాబితాలో 1,24,82,213 మంది పురుష ఓటర్లు, 1,24,75,583 మంది మహిళా ఓటర్లు, 343 మంది మూడవ లింగ వర్గం కింద నమోదు చేసుకున్న ఓటర్లు ఉన్నారు. కాగా, ఈ డేటా రాష్ట్రంలో పురుష, స్త్రీ ఓటర్ల మధ్య దాదాపు సమానత్వాన్ని సూచిస్తుంది.

ఈమేరకు అస్సాంలోని ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయ అధికారులు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి సమగ్రంగా తనిఖీ చేసిన తర్వాత, ప్రత్యేక సవరణ కోసం ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను డిసెంబర్ 27, 2025న ప్రచురించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తూ 2025 నవంబర్ 22, డిసెంబర్ 20 మధ్య ఓటర్ల వెరిఫికేషన్ డ్రైవ్ నిర్వహించారు..

ముసాయిదా జాబితా ప్రచురించిన వెంటనే కమిషన్ వాదనలు,అభ్యంతరాలను దాఖలు చేయడానికి సమయమిచ్చింది, ఈ ప్రక్రియ జనవరి 22, 2026 వరకు కొనసాగింది. ఈ కాలంలో ఓటర్లు దిద్దుబాట్లు, అర్హత కలిగిన ఓటర్లను చేర్చడం, అనర్హులు లేదా మరణించిన వ్యక్తుల తొలగింపు, ఇతర వ్యత్యాసాలను సరిదిద్దారు. అన్ని వాదనలు,అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత, జాబితాలను ఖరారు చేసి ఫిబ్రవరి 10న ప్రచురించారు.

అస్సాంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ద్వారా… నకిలీ, మార్పులు, అనర్హమైన ఎంట్రీలను తొలగించడం ద్వారా ఓటర్ల జాబితాను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని ECI తెలిపింది. అదే సమయంలో రాబోయే ఎన్నికల ప్రక్రియలకు ముందు అర్హులైన పౌరులందరూ నమోదు అయ్యారని నిర్ధారించుకుంది.

ఖచ్చితమైన ఓటర్ల జాబితాలు స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన,విశ్వసనీయ ఎన్నికలకు మూలస్తంభమని ఇది పునరుద్ఘాటించింది.

మరోవంక ఎన్నికల కమిషన్ పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ షెడ్యూల్‌ను సవరించింది, ఓటర్ల జాబితాల తుది ప్రచురణ తేదీని ఫిబ్రవరి 14, 2026 వరకు పొడిగించింది.

విస్తృతమైన గణన పని, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణను సులభతరం చేయడానికి పొడిగింపు మంజూరు చేసారని అధికారులు తెలిపారు. సవరించిన పశ్చిమ బెంగాల్ షెడ్యూల్ ప్రకారం… బూత్ లెవల్ అధికారులు డిసెంబర్ 11, 2025న ఇంటింటికి తనిఖీ పూర్తి చేశారు; ముసాయిదా జాబితాలు డిసెంబర్ 16, 2025న ప్రచురించారు. జనవరి 15, 2026 వరకు వాదనలు, అభ్యంతరాలను ఆమోదించారు.

కమిషన్ తన విజ్ఞప్తిని పునరుద్ఘాటిస్తూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలలో పౌరులు చురుకుగా పాల్గొనాలని కోరింది, సవరించిన జాబితాలను రూపొందించేందుకు ప్రజల సహకారం అవసరమని నొక్కి చెప్పింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.