Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

బెంగాలీ మాట్లాడేవారిని ‘చొరబాటుదారులు’గా ముద్రవేయడం సరికాదన్న మమతా బెనర్జీ!

Share It:

కోల్‌కత: బెంగాలీ మాట్లాడే ప్రజలను అవమానించడానికి విభజన శక్తులు ప్రయత్నించడం, వారిని “చొరబాటుదారులు (అక్రమ వలసదారులు)”గా ముద్రవేసి వేధించడం పట్ల తాను తీవ్రంగా బాధపడ్డానని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అదే సమయంలో, సంకుచిత రాజకీయాల ద్వారా “బెంగాల్ సంస్కృతిని అణగదొక్కే ప్రయత్నానికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఎవరినీ నేరుగా లక్ష్యంగా చేసుకోనప్పటికీ, పరోక్షంగా బీజేపీపైనే విమర్శలు ఎక్కుపెట్టినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే దేశంలోని పాలక పార్టీ గత కొన్నేళ్లుగా అక్రమ బంగ్లాదేశ్ , రోహింగ్యాలను రాష్ట్ర ఓటర్ల జాబితాలో చేర్చారని ఆరోపిస్తూనే ఉంది.

విభజన శక్తులు బెంగాలీ మాట్లాడేవారిని “చొరబాటుదారులు” అని పిలుస్తూ వారిని అవమానించడం, వేధించడం చూసి నాకు చాలా బాధగా ఉంది. ఇటువంటి చర్యలు రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తాయి. ఈ విధంగా బెంగాల్ గుర్తింపును సంకుచిత మనస్తత్వ రాజకీయాల ద్వారా అణగదొక్కడానికి మేము ఎప్పటికీ అనుమతించము అని ఎక్స్‌ పోస్ట్‌లో మమత పేర్కొన్నారు.”

పశ్చిమ బెంగాల్, అలాగే భారతదేశం, విభిన్న భాషలు, సంస్కృతుల భూమి కాబట్టి, దేశవ్యాప్తంగా మాట్లాడే ఇతర భాషల మాదిరిగానే “బంగ్లా” పట్ల సమాన ప్రేమ ఉండాలని దీదీ అన్నారు.

“బెంగాల్, భారతదేశం, అనేక భాషలు, సంస్కృతుల ద్వీపాలు. మనం భక్తితో బంగ్లాను ప్రేమిస్తున్నట్లే, హిందీ, ఉర్దూ, నేపాలీ, కురుఖ్, కుర్మాలి, రాజ్‌బన్షి, సంతాలి, కమతపురి, సద్రి ఇలా ప్రతి ఇతర భాషను సమానంగా గౌరవిస్తాము. ప్రతి భాష దాని చరిత్ర, ఆకాంక్షలను కలిగి ఉంటుంది. వైవిధ్యంలో ఈ ఐక్యత మా గొప్ప బలం” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

అందువల్ల విభజన శక్తులు బెంగాలీ మాట్లాడే ప్రజలను చొరబాటుదారులుగా ముద్రవేయడానికి ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి వాపోయారు. “ఇటువంటి చర్యలు రాజ్యాంగ విలువల మూలాన్ని దెబ్బతీస్తాయి. అసహనం, సంకుచిత రాజకీయాల ద్వారా బెంగాల్ సంస్కృతిని అణగదొక్కడానికి మేము ఎప్పటికీ అనుమతించము” అని ముఖ్యమంత్రి మమతా అన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.