Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

పాలస్తీనా ఖైదీలను ‘సరైన సమయంలో’ ఉపవాసం ఉండకుండా అడ్డుకుంటున్న ఇజ్రాయెల్!

Share It:

జెరూసలేం: పవిత్ర రంజాన్ మాసంలో ఖైదీలు “సరైన సమయంలో” ఉపవాసం ఉండకుండా ఇజ్రాయెల్ జైలు అధికారులు అడ్డుకుంటున్నారని పాలస్తీనా కమిషన్ ఆరోపించింది. ఈమేరకు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నగరమైన రమల్లాలోని ఓఫర్ జైలు అధికారులు… ఖైదీలు తమ ఉపవాసం ప్రారంభించడానికి, విరమించడానికి వీలుగా ఆయా సమయాల్లో వారిని అప్రమత్తం చేయడానికి నిరాకరిస్తున్నారని పాలస్తీనా కమీషన్ ఫర్ డిటైనీస్ అఫైర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

“ఖైదీలు సహరీ (సూర్యాస్థమయానికి ముందు భోజనం) లేకుండా రంజాన్ పాటిస్తారు, ఇఫ్తార్ (ఉపవాసం విరమించే భోజనం) చేయడం సుదీర్ఘ పరీక్షగా మారుతుంది” అని కమిషన్ న్యాయవాది ఖలీద్ మహాజ్నే అధికారిక వాయిస్ ఆఫ్ పాలస్తీనా రేడియోతో అన్నారు.

ఉత్తర ఇజ్రాయెల్‌లోని గిల్బోవా జైలులోని పాలస్తీనా ఖైదీలకు ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన మాసమైన రంజాన్ ఉపవాస మాసం ప్రారంభం గురించి తెలియలేదని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్ కోర్టు సెషన్‌కు హాజరైనప్పుడు ఖైదీలలో ఒకరు రంజాన్ ప్రారంభం గురించి తెలుసుకున్నారని ఆయన అన్నారు.

రెండు సంవత్సరాలుగా, పాలస్తీనియన్ ఖైదీలు ఇఫ్తార్ కోసం మిగిలిపోయిన ఆహారాన్ని మాత్రమే తినవలసి వచ్చింది” అని మహాజనే అన్నారు.

మతపరమైన సందర్భాలలో పాలస్తీనియన్ ఖైదీల ఆనందాన్ని తుడిచివేయడానికి ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. పాలస్తీనియన్లను అక్రమంగా జైళ్లలో పెట్టి ఉద్దేశపూర్వకంగా వారి కుటుంబాల ఆనందాన్ని బాధతో నింపుతోందని ఆయన అన్నారు.

పాలస్తీనియన్, ఇజ్రాయెల్ మానవ హక్కుల సంస్థల ప్రకారం…350 మంది పిల్లలు సహా 9,300 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రస్తుతం ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్నారు. వారిని ఏకపక్షంగా హింసిస్తున్నారు. ఆకలి బాధలు అనుభవించేలా చేస్తున్నారు. ఇక వైద్య నిర్లక్ష్యం సరేసరి. ఫలితంగా డజన్ల కొద్దీ పాలస్తీనియన్‌ ఖైదీలు మరణిస్తున్నారని ఆయా సంస్థలు తెలిపాయి.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.