Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

‘X’లో హలీం బహిష్కరణ పిలుపు…తిప్పికొట్టిన నెటిజన్లు!

Share It:

హైదరాబాద్: ప్రస్తుతం రంజాన్ సీజన్ కావడంతో ప్రజలు తమ సమీప హలీమ్ అవుట్‌లెట్‌లకు భారీగా క్యూ కడుతున్నారు. దీంతో కొంతమంది ఈ వంటకం ప్రజాదరణను భరించలేక, దానిని పూర్తిగా బహిష్కరించాలని సోషల్‌మీడియాలో పిలుపునిచ్చారు. ఈమేరకు Tathvam-asi ఖాతా నుండి X లో పోస్ట్ చేసారు. ఈ సీజన్‌లో హలీమ్ తినబోమని ప్రమాణం చేయాలని హిందువులకు పిలుపునిచ్చింది.

కాగా, హిందువులు హలీమ్‌ను బహిష్కరించాలన్న పిలుపు (#SayNoToHaleem) తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ వర్గం చేసిన ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు తిప్పికొట్టారు. అనేకమంది ఈ చర్యను ఖండిస్తూ, మత సామరస్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆహారాన్ని మతంతో ముడిపెట్టవద్దని, ఇది ఐక్యతకు ప్రతీక అని చాలామంది వాదించారు. ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న పోస్టర్‌ను విమర్శించారు.

“మీరు ద్వేషాన్ని ఎందుకు వ్యాప్తి చేస్తున్నారు. నేను హిందువుగా హలీమ్‌ను ప్రేమిస్తున్నాను. మీ సమస్య ఏమిటి?” అని ఒక X వినియోగదారుడు చెప్పగా, మరొకరు, “తెలంగాణ ప్రజలు దేనికైనా రాజీపడవచ్చు, కానీ నేను ఆహారం విషయంలో ఎప్పుడూ రాజీపడను” అని అన్నారు.

మరికొందరు వ్యంగ్యంగా మాట్లాడుతూ… హలీం బహిష్కరణ పిలుపు ముస్లింలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ రేవతి కూడా ఈ వంటకాన్ని సమర్థించారు, దీనిని “నగర సంస్కృతిలో అంతర్భాగం” అని, హలీం కోసం “ముస్లిమేతరులు కూడా ఎదురు చూస్తున్నారు” అని అన్నారు.

ఈ వంటకం వేలాది మందికి ఆదాయాన్ని ఎలా సంపాదించడంలో సహాయపడుతుందో ఆమె ఆధారాలతో సహా వివరించారు. ఈ వంటకం రిచ్‌ ప్రోటీన్‌ను కలిగి ఉందని ఆమె నొక్కి చెప్పారు. “2010లో హైదరాబాద్ హలీమ్‌కు GI ట్యాగ్ కూడా లభించింది, ఇది భారతదేశంలో GI ట్యాగ్ సంపాదించిన మొట్టమొదటి మాంసాహార వంటకమని ఆమె అన్నారు. అంతేకాదు మా బిర్యానీ,హలీమ్ దగ్గరకు రావడానికి ప్రయత్నించవద్దు!” అని ఆమె వారికి ఓ సలహా కూడా ఇచ్చారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.