న్యూఢిల్లీ: ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి పట్ల జమాతే ఇస్లామీ అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లా హుసేనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు. వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఈ కఠిన సమయంలో ఇరాన్ ప్రజలకు సంఘీభావంగా నిలుద్దామన్నారు. అమరగతి పొందిన కుటుంబానికి సహనం, స్థైర్యం అందించాలని దైవంతో వేడుకున్నారు.
సమకాలీన ముస్లిం ప్రపంచంలో ఆయతుల్లా అలీ ఖమేనీ ఒక మహోన్నత వ్యక్తి, ఆయన నాయకత్వం మూడు దశాబ్దాలకు పైగా ఇరాన్‌కు రాజకీయ, సైద్ధాంతిక మార్గాన్ని రూపొందించింది. ఆయన చూపిన స్థిరత్వం, విదేశీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలిపిందని జమానేత నేత పేర్కొన్నారు. ఆయన జీవితం తన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, ఇరాన్ ఇస్లామిక్ విప్లవ సూత్రాలను నిలబెట్టడానికి పూర్తి నిబద్ధతను కనబరిచిందని ఆయన అన్నారు.
ఆయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడి అని సాదతుల్లా హుసేనీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు UN చార్టర్ ప్రకారం ఇది ఉద్దేశపూర్వక దురాక్రమణ చర్య, దీనికి US, ఇజ్రాయెల్ అంతర్జాతీయ సమాజం ముందు పూర్తిగా జవాబుదారీగా ఉండాలని జమాత్ నేత అన్నారు.
ఇరాన్‌పై దాడులను తక్షణమే ఆపాలని, ఈ ప్రమాదకరమైన ధోరణిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం వెంటనే చర్య తీసుకోవాలని జమాత్ నేత పిలుపునిచ్చారు. ఇరాన్‌పై ఈ అసంకల్పిత దాడిని ప్రారంభించడానికి కారణమైన వారిని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు హాజరుపరచాలని సయ్యద్ సాదతుల్లా హుసేనీ డిమాండ్ చేశారు.

