Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా AICC ఇన్‌చార్జ్‌కు లేఖ రాసిన మూసీ జన్ ఆందోళన్ కార్యకర్తలు!

Share It:

హైదరాబాద్: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిలిపివేయాలని మూసీ జన్ ఆందోళన్ కార్యకర్తలు AICC తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు లేఖ రాశారు.

ఈమేరకు రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ గ్రామంలో ఉన్న 10.34 ఎకరాల భూమిని అన్యాయంగా స్వాధీనం చేసుకోవడాన్ని ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. ఫలితంగా మధుపార్క్ రిడ్జ్‌ అపార్ట్‌మెంట్‌ వాసులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేరొన్నారు. ప్రాజెక్ట్‌ కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూమిని కోరడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రజల వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ, శంకుస్థాపనకు కేంద్ర మంత్రిని ఆహ్వానించారని లేఖలో పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని కూడా MJA ఎత్తి చూపింది. ‘బాపూజీ బతికి ఉంటే ‘నా పేరుతో ఇలాంటి పనులు చేయకండి’ అని వారించేవారని మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కూడా ఈ ప్రాజెక్టును Xలో విమర్శించిన విషయాన్ని వారు లేఖలో ప్రస్తావించారు.

2017 రాష్ట్ర సవరణ ద్వారా న్యాయమైన పరిహారం, భూసేకరణలో పారదర్శకత హక్కు చట్టం కింద సామాజిక ప్రభావ అంచనా నుండి ప్రాజెక్టుకు మినహాయింపు ఇవ్వడాన్ని కూడా MJA ఖండించింది, ఇది ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిపింది.

ప్రస్తుత విధానం నది పర్యావరణ వ్యవస్థ, ప్రభావిత సమాజాలు, తెలంగాణ పౌరులందరిపై హానికరమైన ప్రభావాలను చూపుతుందని MJA హెచ్చరించింది.

“ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత రూపంలో కొనసాగితే, ప్రజల గొంతులను విస్మరిస్తుంది. మన సహజ వారసత్వానికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది” అని మీనాక్షి నటరాజన్‌కు రాసిన లేఖలో మూసీ జన్‌ ఆందోళన్‌ బృందం సభ్యులు కోరారు.

ఈ అంశంపై జోక్యం చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వాస్తవ పరిస్థితులను వివరించాలని బృందం సభ్యులు డిమాండ్‌ చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ప్రారంభించకుండా చూసుకోవాలని, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని MJA సభ్యులు AICC ఇన్‌చార్జ్‌ నటరాజన్‌ను కోరింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.