Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

అస్సాంలో “నిరుద్యోగం పెరిగింది”…బీజేపీపై ప్రియాంక గాంధీ విమర్శలు!

Share It:

గౌహతి: అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ఆరు ఆదివాసీ సమూహాలకు ఎస్టీ హోదాను ఆలస్యం చేస్తోందని, రాష్ట్రంలోని 10 లక్షల మందికి ఉచిత చికిత్స, శాశ్వత భూమి పట్టాలు ఇస్తామన్న హామీ నెరవేరలేదని ఆమె ఆరోపించారు.

“బీజేపీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయలేదు. నిరుద్యోగం పెరుగుతోంది. బీజేపీ పాలనలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు,” అని దిబ్రూగఢ్ జిల్లాలోని ఖోవాంగ్ నియోజకవర్గంలో జరిగిన ఒక ర్యాలీలో ఆమె అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) అభ్యర్థి లురింజోతి గోగోయ్ తరఫున ఆమె ప్రచారం చేశారు.

సంక్షేమ పథకాల అమలును కూడా ప్రియాంక గాంధీ విమర్శించారు. అరుణోదోయ్ పథకం కింద లబ్ధి పొందుతున్న మహిళలను రాజకీయ ర్యాలీలకు హాజరయ్యేలా బలవంతం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

“ర్యాలీలకు హాజరు కావాలని మహిళలను బలవంతం చేస్తున్నారు. లేకుంటే లబ్ధిదారుల జాబితాల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారు. పథకాలు ఇలా పనిచేయకూడదు”, “ప్రజాధనం ముఖ్యమంత్రికి చెందినది కాదని” అన్నారు.

ఎగువ అస్సాంలోతేయాకు తోట కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె ప్రస్తావించారు. వేతన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని ప్రియాంక ఆరోపించారు. “బీజేపీ రూ. 300-350 ఇస్తామని వాగ్దానం చేసింది, కానీ ఈనాటికీ స్వల్ప పెరుగుదల మాత్రమే జరిగిందని కార్మికులు చెబుతున్నారని” ఆమె పేర్కొన్నారు.

100 రోజుల్లోగా గాయకుడు జుబీన్ గార్గ్‌కు న్యాయం చేయడం, మహిళలు, సీనియర్ సిటిజన్లకు ఆర్థిక సహాయం అందించడంతో సహా కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలను కూడా ఆమె వివరించారు. “మార్పు కోసం ప్రజలందరూ ఏకమైతే, జుబీన్ గార్గ్ కలలు కన్న అవినీతి రహిత అస్సాం సాధ్యపడుతుందని” ప్రియాంక అన్నారు.

“రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించింది. అస్సాంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ప్రజలకు ఉచిత చికిత్స అందించడంతో పాటు, అస్సాం ఆదివాసీ ప్రజలకు 10 లక్షల శాశ్వత భూమి పట్టాలు ఇస్తాము,” అని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక అన్నారు. కాగా, టింగ్‌కాంగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బిపుల్ గోగోయ్ కోసం, నజీరా నియోజకవర్గంలో దేబబ్రత సైకియా కోసం కూడా ప్రియాంక ప్రచారం చేశారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.