Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

హర్ముజ్ ‘మా నియంత్రణలో’ ఉంది…ఇరాన్!

Share It:

టెహ్రాన్‌: హర్ముజ్ జలసంధి తెరిచి ఉందన్న అమెరికా వాదనలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నౌకాదళం తోసిపుచ్చింది. చమురు ధరలను నియంత్రించడానికి, అమెరికా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా వాటిని అభివర్ణించింది. హర్ముజ్‌పై తమకు ‘పూర్తి నియంత్రణ’ ఉందని ఇరాన్ పేర్కొంది ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు ముగిసి, సంబంధిత హామీలు అమలు చేసేంత వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా, గత వారం పశ్చిమాసియాలో వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ సాధించామని, దానిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ‘వాల్ ఆఫ్ స్టీల్’ (ఉక్కు గోడ)గా అభివర్ణించిన ట్రంప్, దీనిని ఇరాన్ ప్రతిఘటించలేదని పేర్కొన్నారు. ఇరాన్ వద్ద సమర్థవంతమైన నావికాదళం కానీ, వైమానిక దళం కానీ లేవని ఆయన ఎద్దేవా చేశారు. ఆ దేశ సైనికులకు కనీసం వేతనాలు కూడా అందడం లేదని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలహీనపడి వెనకడుగు వేస్తోందని ఆరోపించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.