Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌ కుమార్ ఎక్కడ?

Share It:

న్యూఢిల్లీ: భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజ సంఘాలు, యువజన సంఘాలు, సాధారణ పౌరులు దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్న తరుణంలో, ఒక ప్రశ్న మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అసలు ఆయన ఎక్కడ ఉన్నారు?

సెప్టెంబర్ 23న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సంచలనాత్మక కథనం వెలువడినప్పటి నుండి, జ్ఞానేష్ కుమార్ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. కేవలం సెప్టెంబర్ 26న ఇతర కమిషనర్లతో కలిసి ఉన్న ఒకే ఒక ఫోటో మాత్రమే ఈసీ విడుదల చేసింది.

అంతకుముందు నిత్యం ఆయన విదేశీ పర్యటనలు, ఆలయ సందర్శనలు, సమావేశాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తేది. కానీ, ఇప్పుడు ఆయన జాడే లేదు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన ప్రసంగించాల్సిన రెండు యువజన కార్యక్రమాలు లాజిస్టికల్ కారణాలంటూ రద్దు చేశారు. అంతేకాదు మాజీ అధికారులు, ప్రతిపక్ష ఎంపీలు ఈసీని కలవడానికి ప్రయత్నించినప్పటికీ అనుమతించలేదు. మీడియా ప్రతినిధులు వాట్సాప్ గ్రూపులలో అడిగిన ప్రశ్నలకు అధికారుల నుండి మౌనమే సమాధానంగా వస్తోంది.

కనీసం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే టీవీ ఛానెళ్లలో కూడా ఆయన కనిపించలేదు. ఎస్ఐఆర్ (SIR)కు సంబంధించి ఈసీ తన సోషల్ మీడియా ఖాతాలలో కార్యకలాపాలను పోస్ట్ చేస్తూనే ఉంది, కానీ కుమార్ మాత్రం ఇప్పుడు కనిపించడం లేదు. మాజీ హోం సెక్రటరీ జి.కె. పిళ్ళై, మాజీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సహా మాజీ సివిల్ సర్వెంట్ల బృందం ఒకటి సీఈసీకి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించింది, కానీ కనీసం దగ్గరకు కూడా వెళ్లలేకపోయింది.

ఎన్నికల కమిషన్‌ను కలవాలనుకున్న ప్రతిపక్ష ఎంపీలను కార్యాలయాలకు చేరుకోనివ్వలేదు. సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సమీపంలోని ఆకాశవాణి భవన్‌లో గంటల తరబడి ధర్నాకు కూర్చున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల సీఈఓలకు బదులుగా అధికార ప్రతినిధులు ట్వీట్లు పంపుతూ విషయాన్ని పక్కకు మళ్లించారు. ఒకప్పుడు, ఆ బృందం జ్ఞానేష్ కుమార్ గుప్తా విశాలమైన చిరునవ్వుతో ఉన్న ఫోటోలతో నిండి ఉండేది. కానీ, ప్రస్తుతం అతని ఫోటోలు మాయమయ్యాయి.

ఈ వారం రవిష్ కుమార్ షోకి వచ్చిన స్వతంత్ర పాత్రికేయుడు నరేంద్ర నాథ్, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీలతో కలిసి పార్లమెంట్ హౌస్ నుండి రాష్ట్రపతి వద్దకు వినతిపత్రంతో పాదయాత్ర చేయడానికి ప్రణాళిక వేస్తున్న కచ్చితమైన సమయంలో, ముగ్గురు ఎన్నికల కమిషనర్లు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహిస్తారని ఒక కేంద్ర మంత్రి మోడీకి హామీ ఇచ్చినప్పటికీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సూటిగా నిరాకరించారని ఉన్నత వర్గాలు తనకు ధృవీకరించినట్లు చెప్పారు. అయితే ఎటువంటి సంయుక్త విలేకరుల సమావేశం జరగలేదు మరియు ఎన్నికల సంఘం మీడియా బృందం మొత్తం ఎన్నికల సంఘం ఏ సమావేశ వివరాలను విలేకర్లతో పంచుకోలేదు.

ఒకవైపు నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు బలప్రయోగం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్న సమయంలో, ఈ వివాదాలన్నింటికీ కేంద్ర బిందువైన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒక్క రోజు కూడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పౌరులకు ఎంతైతే ఈ ప్రశ్నకు సమాధానం ముఖ్యామో, ప్రభుత్వానికి కూడా అంతే ప్రాధాన్యత కావాలి.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.