Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

హైదరాబాద్‌లో ‘బియాండ్ ది డివైడ్’ ఎగ్జిబిషన్.. ద్వేషానికి స్వస్తి, సామరస్యానికి స్వాగతం!

Share It:

హైదరాబాద్: అపోహలు, తప్పుడు ప్రచారాలతో సమాజంలో పెరుగుతున్న విభేదాలను తొలగించి, పరస్పర అవగాహనను పెంపొందించేందుకు జమాతే ఇస్లామీ హింద్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘బియాండ్ ది డివైడ్ – కౌంటరింగ్ హేట్, బిల్డింగ్ హార్మనీ’ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

మొత్తం పది గ్యాలరీలతో రూపొందించిన ఈ ప్రదర్శన ద్వారా వివిధ మతాలు, సంస్కృతుల పట్ల ఉన్న అపోహలను తొలగించి, సంభాషణలు, పరస్పర గౌరవం ద్వారా సామాజిక సామరస్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ హైదరాబాద్ అధ్యక్షుడు డాక్టర్ ముబషిర్ అహ్మద్ మాట్లాడుతూ, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ పరస్పరం గౌరవించుకుంటూ జీవించడం సాధ్యమేనని పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని నమ్మే ముందు వాస్తవాలను పరిశీలించాలని, ద్వేషం స్థానంలో అవగాహనను పెంపొందించాలని పిలుపునిచ్చారు.

**వేదిక:** ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, హైదరాబాద్

**తేదీలు:** అక్టోబర్ 30 – నవంబర్ 1వరకు

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.