న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నవంబర్ 1న ‘ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘చలో దిల్లీ రాంలీలా మార్చ్’లో ప్రజలంతా భాగస్వాములు కావాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.ఈ మహా ప్రదర్శనలో రాజకీయాలకు అతీతంగా విద్యార్థి సంఘాలన్నీ భాగస్వామ్యం కావాలన్నారు. అంతేకాదు పోలీసుల లాఠీలకు, బెదిరింపులకు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు.”పోలీసులకు గానీ, వారి లాఠీలకి గానీ ఎవరూ భయపడవద్దు” అని రాహుల్ భరోసానిచ్చారు.
ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే గాంధీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, “బీజేపీకి తమ కుతంత్రాలను ప్రయోగించే ధైర్యం ఉండదు” అని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, ఎన్నికల అవకతవకలను అంతం చేయడం, రాజ్యాంగాన్ని కాపాడటమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు.
ఈమేరకు X (ట్విట్టర్) వేదికగా విడుదల చేసిన వీడియోలో, ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసం చేస్తున్న యాత్ర కాదని, భారతదేశ ఆత్మ కోసం చేస్తున్న పోరాటమని రాహుల్ గాంధీ అభివర్ణించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ల విధానాలతో విసిగిపోయిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో గళం కలపాలని ఆహ్వానించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి చేస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి కోట్లాది పేర్లను తొలగిస్తూ దేశవ్యాప్తంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మా ఓట్లను దొంగిలిస్తున్నారు. మేము నిలదీస్తే మాపై లాఠీచార్జిలు, నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు. కానీ మమ్మల్ని భయపెట్టలేరు” అని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఈ యాత్రను అడ్డుకోవడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలం కావని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ (SIR) ద్వారా అక్రమంగా ఓటు హక్కును కోల్పోయిన కోట్లాది మంది భారతీయుల కోసం ఈ నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టుకు ఇండియా బ్లాక్ చేపట్టిన తరహాలోనే ఈ యాత్ర కూడా పూర్తి శాంతియుతంగా సాగుతుందని, ఢిల్లీ పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన ధైర్యం చెప్పారు.
అలాగే, ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) లోని అవకతవకలపై అక్టోబర్ 30 శుక్రవారం నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన ప్రజా అభిశంసనవిచారణ కూడా జరగనుంది.


