Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఇరాన్‌పై అమెరికా సైనిక ఖర్చు $48.3 బిలియన్లు…!

Share It:

వాషింగ్టన్‌: ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఇరాన్‌తో సైనిక ఘర్షణ కోసం అమెరికా చేసిన ఖర్చు నవంబర్ 13 నాటికి సుమారు $48.3 బిలియన్లకు చేరిందని పెంటగాన్ బడ్జెట్ అధికారి ఆర్థర్ మిల్లర్ వెల్లడించారు. నేవీ కంప్ట్రోలర్ పదవికి తన నామినేషన్‌కు సంబంధించి సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ ముందు హాజరైన సందర్భంగా ఆయన ఈ వివరాలను తెలియజేశారు.

ఖర్చులో ఏమేమి ఉన్నాయి?
ఆర్థర్ మిల్లర్ తెలిపిన వివరాల ప్రకారం…క్షేత్రస్థాయిలో మోహరించిన బలగాలు, సైనిక ఆపరేషన్ల నిర్వహణ ఖర్చులు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఘర్షణలో వినియోగించిన క్షిపణులు, ఇతర ఆయుధ నిల్వల భర్తీ వంటివి ఈ ఖర్చులో ఉన్నాయి.

పరికరాల పునరుద్ధరణ
దెబ్బతిన్న లేదా కోల్పోయిన సైనిక సామగ్రి స్థానంలో కొత్త వాటి సమకూర్చుకునేందుకు ఆగస్టు 1 నాటికి బడ్జెట్ అంచనాలతో పోలిస్తే… ఈ వ్యయం సుమారు 27 శాతం పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.సైనిక స్థావరాల నష్టం లెక్కలు బయటకు రాలేదు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల వల్ల అమెరికా సైనిక స్థావరాలకు వాటిల్లిన నష్టాన్ని బాగు చేసే (రిపేర్) ఖర్చును ఈ $48.3 బిలియన్లలో కలపలేదు. ఆ నష్టం అంచనాలు తన వద్ద లేవని, త్వరలోనే సేకరిస్తామని మిల్లర్ సెనేటర్లకు తెలిపారు.

డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటాల్, కమిటీ ఛైర్మన్ రిపబ్లికన్ సెనేటర్ రోజర్ వికర్ ఈ నష్టాల వివరాలను వీలైనంత త్వరగా సమర్పించాలని కోరారు. గత నివేదికల ప్రకారం హ్యాంగర్లు, రాడార్ వ్యవస్థలు, గిడ్డంగులు, సైనిక నివాసాల వంటి స్థావరాల మరమ్మతులకు అదనంగా బిలియన్ల కొద్దీ డాలర్లు (కొన్ని అంచనాల ప్రకారం $5 బిలియన్ల నుండి $15 బిలియన్ల వరకు) ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

దీంతో ఆయా స్థావరాలకు జరిగిన నష్టాన్ని కూడా లెక్కించి వెల్లడించాలని అమెరికా చట్టసభ సభ్యులు పెంటగాన్‌ను కోరుతున్నారు. మరోవైపు ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపాలంటూ డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రిపబ్లికన్లు సెనేట్‌లో అడ్డుకున్నారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలని కోరుతూ డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రిపబ్లికన్లు సెనేట్‌లో అడ్డుకున్నారు. 48-51 ఓట్ల తేడాతో తీర్మానం వీగిపోయింది. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురైన ఓటమి తర్వాత యుద్ధంపై సెనేట్‌లో జరిగిన తొలి ప్రధాన ఓటింగ్ ఇదే.

భారీ రక్షణ బడ్జెట్ చర్చలు: కాగా, ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన $1.5 ట్రిలియన్ల రక్షణ బడ్జెట్‌పై అమెరికా కాంగ్రెస్‌లో తీవ్ర చర్చలు జరుగుతున్న వేళ ఈ యుద్ధ ఖర్చు గణాంకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మధ్యంతర ఎన్నికల ప్రభావం: ఇటీవలి మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు వెనుకంజ వేయడం, వచ్చే జనవరిలో డెమోక్రాట్లు కాంగ్రెస్‌లో పట్టు సాధించనున్న నేపథ్యంలో యుద్ధ నిధులు, ఖర్చులపై రానున్న రోజుల్లో మరింత తీవ్రమైన రాజకీయ, ఆర్థిక ఘర్షణలు నెలకొనే అవకాశం ఉంది.

నవంబర్ 19న అమెరికా సెనెట్ సాయుధ దళాల కమిటీ విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. యుద్ధ ఖర్చుల పారదర్శకత, రక్షణ బడ్జెట్‌పై అమెరికా కాంగ్రెస్‌లో చర్చ కొనసాగుతోంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.