టెల్‌అవీవ్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని చారిత్రాత్మక ప్రదేశంలో సింహభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ యోచిస్తోంది. పాలస్తీనా భూభాగంలో అక్రమంగా ఉంటున్న సెటిలర్లు రాత్రికి రాత్రే కొత్త అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు.
గురువారం అసోసియేటెడ్ ప్రెస్‌కు లభించిన పత్రంలో వెస్ట్ బ్యాంక్‌లోని ఒక ప్రధాన పురావస్తు ప్రదేశమైన సెబాస్టియాలోని పెద్ద ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ఉద్దేశ్యాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. పీస్ నౌ, యాంటీ-సెటిల్మెంట్ వాచ్‌డాగ్ గ్రూప్, ఈ స్థలం దాదాపు 1,800 డూనమ్స్ (450 ఎకరాలు) అని చెప్పింది . కాగా, బెత్లెహెం సమీపంలో కొత్తగా, అనధికార సెటిల్‌మెంట్‌ను సృష్టించినందుకు ఇజ్రాయెల్ సెటిలర్లు సంబరాలు జరుపుకున్నారు.


