కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి అధికారికంగా ముగిసింది.
“భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174, క్లాజ్ 2 ప్రకారం నాకు దఖలుపడిన అధికారాలను ఉపయోగించి, పశ్చిమ బెంగాల్ శాసనసభను 2026 మే 7 నుంచి రద్దు చేస్తున్నాను” అని గవర్నర్ తన నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు.
మొత్తంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించడం అనే చివరి ప్రయత్నం, గవర్నర్ ఆర్.ఎన్. రవి రాష్ట్ర శాసనసభను రద్దు చేయడంతో ఒకరకంగా నిరాశాజనకంగా ముగిసింది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు అసెంబ్లీ పదవీకాలం ముగియాల్సి ఉంది. గురువారం సాయంత్రం, రాజ్‌భవన్ నిన్న జారీ చేసిన ఒక లేఖను “సాధారణ సమాచారం కోసం” బహిరంగపరిచింది.


