Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

అమెరికా హాలోవీన్ సంబరాల్లో విషాదం…దుండగుల కాల్పులు 24 మంది మృతి!

Share It:

వాషింగ్టన్‌: అమెరికా హాలోవీన్ సంబరాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ వేడుకల సమయంలో జరిగిన వరుస కాల్పుల ఘటనల్లో కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోగా, 94 మందికి పైగా గాయపడ్డారు. ప్రధాన వేడుకలు, సమావేశాలు జరగాల్సిన వేళ.. ఈ తుపాకీ హింస దేశాన్ని వణికించింది.

న్యూయార్క్ టైమ్స్ లెక్కల ప్రకారం…ఈ కాల్పుల ఘటనలు కాలిఫోర్నియా నుండి డెలావేర్ వరకు పలు రాష్ట్రాల్లో విస్తరించాయి. పార్టీ వేదికలు, షాపింగ్ సెంటర్లు, నైట్‌క్లబ్బులు, విశ్వవిద్యాలయ ప్రాంగణాల సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఘటనల తీవ్రతను బట్టి మృతుల సంఖ్యపై భిన్న అంచనాలున్నాయి.

డీప్ ఎల్లమ్ ప్రాంతంలో కేవలం 75 నిమిషాల వ్యవధిలో జరిగిన మూడు వేర్వేరు కాల్పుల ఘటనల్లో నలుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. బర్మింగ్‌హామ్ లీజియన్ ఫీల్డ్ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి విశ్వవిద్యాలయ సంబంధం లేని 17 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద గ్లాక్ కన్వర్షన్ స్విచ్ అమర్చిన తుపాకీ లభించింది.

కాలిఫోర్నియాలో శుక్రవారం రాత్రి ఓ షాపింగ్ స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో 31 ఏళ్ల గర్భిణి ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. దీంతో నిర్వాహకులు ముందుగా తలపెట్టిన ట్రిక్-ఆర్-ట్రీటింగ్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. డెలావర్‌లో శనివారం రాత్రి కేవలం గంట వ్యవధిలోనే రెండు సామూహిక కాల్పులు జరిగాయి.

నెవార్క్‌లో మరో ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనలపై డెలావేర్ గవర్నర్ మాట్ మేయర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. తుపాకీ హింసను దైనందిన జీవితంలో ఒక భాగంగా అంగీకరించవద్దని ప్రజలను కోరారు.

జాక్సన్‌విల్లే (ఫ్లోరిడా): హాలోవీన్ పార్టీల సందర్భంగా జరిగిన రెండు వేర్వేరు కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. చిన్న గొడవలు కాస్తా కాల్పులకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హింసాకాండలో పసిపిల్లలు, విద్యార్థులు ఎక్కువగా బలయ్యారు. రెండు వారాల క్రితం ఒరెగాన్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు పిల్లలు, ఉపాధ్యాయుడు హత్యకు గురైన ఘటన మరవకముందే ఈ దుర్ఘటనలు జరగడం గమనార్హం.

ఎఫ్‌బీఐ డేటా విశ్లేషణ ప్రకారం.. జూలై 4, జనవరి 1 తర్వాతి స్థానంలో అక్టోబర్ 31వ తేదీ అమెరికాలో మూడవ అత్యంత హింసాత్మకమైన రోజుగా రికార్డయింది. ముఖ్యంగా మైనర్లకు హాలోవీన్ అత్యంత ప్రమాదకరమైన రోజుగా నేర పరిశోధకుడు జేమ్స్ అలన్ ఫాక్స్ పేర్కొన్నారు. పెద్ద ఎత్తున జనం గుమికూడటం, విచ్చలవిడిగా మద్యం, మాదకద్రవ్యాల వాడకం, తుపాకులు సులభంగా అందుబాటులో ఉండటమే ఈ దారుణాలకు ప్రధాన కారణాలని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.