Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

అల్లాహ్ చూపిన దాన మార్గం…వక్ఫ్!

Share It:

మనుషులు చేయదగ్గ అత్యుత్తమ ధార్మిక కార్యక్రమం, బాధ్యత…దానం. అందుకే ఇస్లాం ఇలాంటి మంచి పనుల్ని ప్రోత్సహించింది. మనిషిలోని వ్యక్తిగత భావోద్వేగాలను, లోభత్వాన్ని తగ్గించి అతడిని ఉదారుడిగా మార్చింది. దైవ మార్గంలో ఖర్చు పెట్టేందుకు తమ ఆస్తులను దానం చేసే వారు ఎంతో ధన్యులని తెలిపింది. పుణ్యాత్ముల చేత విరివిగా దైవ మార్గంలో దానాలు చేయించింది. ఇలా దైవ మార్గంలో దానం చేసిన ఆస్తులనే వక్ఫ్ ఆస్తులుగా పేర్కొంది.

‘వక్ఫ్’ ఆస్తులుగా పిలిచే వాటిని దానాల రూపంలో స్వీకరించి పేదల సేవకు ఖర్చు చేయిస్తున్నది. ‘ప్రజలంతా దేవుడి కుటుంబమే. ఎవరైతే ఆయన కుటుంబానికి ప్రయోజనం చేకూరుస్తారో.. వారే దేవుడికి ప్రీతిపాత్రులు’ అని మహా ప్రవక్త (సఅసం) స్పష్టంగా ప్రవచించారు.

‘మీరు అమితంగా ప్రేమించే వస్తువుల్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు’ అని ఖుర్ ఆన్ లో అల్లాహ్ పేర్కొంటున్నాడు. ఈ అయత్ అవతరించాక అబూ తల్హా అన్సారీ(రజీ) ఇలా అన్నారు… ‘హుజూర్..నాకున్న ఆస్తిలో మధురమైన నీటిని అందించే బైరహ్ బావి గల తోట నాకు అత్యంత ప్రియమైనది. దాన్ని నేను అల్లాహ్ మార్గంలో దానం చేస్తున్నాను. దాన్ని మీ ఇష్టం వచ్చిన రీతిలో ఉపయోగించుకోండి’ అని. దానికి మహా ప్రవక్త(సఅసం) సమాధానమిస్తూ… తోటలోని ఉత్పత్తిని మాత్రం దానం చేయమని ఆదేశించారు. ఈ దానం ఇస్లాంలో మొట్టమొదటి వక్ఫ్ దానంగా నిలిచిపోయింది

ఈ వక్ఫ్ ఆస్తుల ద్వారా సామూహిక సంస్థలు, సామాజిక సంస్థలు తమ ఆశయాలను, లక్ష్యాలను బాగా నెరవేర్చుకుంటున్నాయి. ఇలా ఇస్లాం చరిత్రలో, సంస్కృతిలో వక్ఫ్ నాటి నుంచి నేటి వరకు కీలక పాత్ర పోషిస్తున్నది. వక్ఫ్ ద్వారా సామూహిక, ప్రజా సంక్షేమ సంస్థలు నెలకొల్పారు. మహా ప్రవక్త స్ఫూర్తితో దాదాపు సహాబీలందరూ తమకున్న ఆస్తిలో ఎంతో కొంత దైవ మార్గంలో వక్ఫ్ ఆస్తిగా మార్చి దైవ మార్గంలో దాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగించారు. 

వక్ఫ్‌కు దానం చేసే సంప్రదాయం హజ్రత్ ఉమర్ (రజి) ఖిలాఫత్ పాలనలో కొత్తగా మళ్లీ ప్రారంభమైంది. వక్ఫ్‌కు దానంగా లభించే భూములకు కొందరు ముహాజిర్లను, అన్సారీలను ఆయన సాక్షులుగా నియమించారు. ఆనాటి నుంచి ప్రభుత్వం పెద్దయెత్తున వక్ఫ్ ఆస్తులను ఏర్పాటు చేసేది. వాటిలో కొన్నింటిని ప్రభుత్వమే ఏర్పాటు చేసేది. మరికొన్నింటిని అమీర్లు, సైన్యాధిపతులు, ఉమ్మత్ లోని ఇతర సంపన్నులు ఏర్పాటు చేసేవారు. వక్ఫ్ దానాలతో పాటు సాధారణ దానాల వల్ల దాతతో పాటు, స్వీకర్త కూడా పుణ్య ఫలితాలు పొందుతారు.
  • ముహమ్మద్ ముజాహిద్

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.