స్టాక్‌హోమ్: మరో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న వేళ, వివిధ దేశాల మధ్య అణ్వాయుధ పోటీ తీవ్రమవుతోంది. తొలిసారి అణ్వస్త్రాలను ప్రయోగించి 80 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా అణ్వస్త్ర తయారీ పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. అణు బాంబులు మానవాళికి ఎంత నష్టం చేకూరుస్తాయో చెప్పడానికి హిరోషిమా, నాగసాకి సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. అణు దాడి ప్రభావం నుంచి ప్రజలు నేటికీ కోలుకోలేక పోయారు. అయినా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు అణుబాంబులపై మోజు తీరలేదు.
ఈమేరకు ప్రస్తుతం అణ్వాయుధాలు కలిగి ఉన్నాయని నమ్ముతున్న తొమ్మిది దేశాల జాబితాలో P5 దేశాలు ఉన్నాయి.
అణ్వాయుధాలు కలిగి ఉన్న మొదటి ఐదు దేశాలు
1. యునైటెడ్ స్టేట్స్
2. రష్యా
3. చైనా
4. ఫ్రాన్స్
5. యునైటెడ్ కింగ్‌డమ్.
అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం
ఈ ఐదు దేశాలు అణ్వాయుధాలు లేని దేశాలు వాటిని నిర్మించకూడదని లేదా పొందకూడదని, అణ్వాయుధ నిరాయుధీకరణ లక్ష్యంగా “మంచి విశ్వాసంతో చర్చలు జరపాలని” కట్టుబడి ఉన్న అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేశాయి.
NPTపై సంతకం చేయని ప్రత్యర్థులు భారతదేశం, పాకిస్తాన్, సంవత్సరాలుగా తమ అణ్వాయుధాలు నిర్మించుకున్నాయి. అణ్వాయుధాలు కలిగిన దేశాల జాబితాలో చేరాయి. 1974లో భారతదేశం మొదటిసారి అణ్వాయుధ పరీక్ష నిర్వహించింది, తరువాత 1998లో మరొకటి జరిగింది. కొన్ని వారాల తర్వాత పాకిస్తాన్ తన సొంత అణ్వాయుధ పరీక్షలను నిర్వహించింది.
NPT పై సంతకం చేయని ఇజ్రాయెల్ కూడా తన వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ఎప్పుడూ అంగీకరించలేదు కానీ అవి ఉన్నాయని విస్తృతంగా నమ్ముతారు.
ఉత్తర కొరియా 1985 లో NPT లో చేరింది కానీ 2003లో అమెరికా దురాక్రమణదారుడు అంటూ ఆరోపించి ఒప్పందం నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. 2006 నుండి, అది వరుసగా అణు పరీక్షలను నిర్వహించింది.
అణ్వాయుధాలు కలిగి ఉన్న తొమ్మిది దేశాల జాబితా
ఈ వారం విడుదల చేసిన వార్షిక అంచనాలో, స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జనవరి నాటికి తొమ్మిది దేశాలు సైనిక అణు వార్‌హెడ్‌ల నిల్వలను కలిగి ఉన్నాయని అంచనా వేసింది:
రష్యా: 4,309
యునైటెడ్ స్టేట్స్: 3,700
చైనా: 600
ఫ్రాన్స్: 290
యునైటెడ్ కింగ్‌డమ్: 225
భారతదేశం: 180
పాకిస్తాన్: 170
ఇజ్రాయెల్: 90
ఉత్తర కొరియా: 50
మరోవంక ఇరాన్ చాలా కాలంగా తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని పట్టుబడుతోంది. కానీ ఇటీవలి సంవత్సరాలలో అది యురేనియంను 60 శాతం వరకు స్వచ్ఛతకు – దాదాపు 90 శాతం ఆయుధ-గ్రేడ్ స్థాయిలకు – ఫ్యూరిపై చేస్తోంది.