న్యూఢిల్లీ: రష్యన్ సైన్యంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ గురువారం యూరోపియన్ యూనియన్ 45 సంస్థలపై ఆంక్షలు విధించింది. వీటిలో భారతదేశానికి చెందిన మూడు కంపెనీలు ఉన్నాయి. ఉక్రెయిన్పై దాడి చేసినందుకు రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచే ప్రయత్నాలలో భాగమైన EU తన 19వ ఆంక్షల ప్యాకేజీలో భాగంగా ఈ సంస్థలపై శిక్షాత్మక చర్యలను విధించింది. కాగా, EU చర్యకు భారత అధికారుల నుండి తక్షణ ప్రతిస్పందన రాలేదు.
ఈమేరకు ఆయా సంస్థల ఆస్తులను స్తంభింపజేయడం, ఆర్థిక, షిప్పింగ్ సేవలపై పరిమితులు విధించడం, సైనిక-పారిశ్రామిక సముదాయానికి అవసరమైన రసాయన పరికరాలు, క్షిపణి చోదక భాగాలు, అధునాతన యంత్రాల ఎగుమతిపై నిషేధాన్ని ఎదుర్కోనున్నాయి.
“యంత్ర పరికరాలు, మైక్రోఎలక్ట్రానిక్స్, మానవరహిత వైమానిక వాహనాలు, ఇతర అధునాతన సాంకేతిక అంశాలపై ఎగుమతి పరిమితులను అధిగమించడానికి వీలు కల్పించడం” ద్వారా రష్యా సైనిక మరియు పారిశ్రామిక సముదాయానికి “ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్న” 45 కొత్త సంస్థలను యూరోపియన్ కౌన్సిల్ గుర్తించిందని EU రీడ్ అవుట్ తెలిపింది.
“ఈ సంస్థలు ద్వంద్వ-ఉపయోగ వస్తువులకు సంబంధించి కఠినమైన ఎగుమతి పరిమితులకు లోబడి ఉంటాయి, అలాగే రష్యా రక్షణ రంగం సాంకేతిక అభివృద్ధికి సాధారణంగా దోహదపడే వస్తువులు ఉంటాయి” అని అది పేర్కొంది. “ఈ సంస్థలలో పదిహేడు రష్యాలో ఉండగా, 12 చైనాలో ఉన్నాయి. హాంకాంగ్, మూడు భారతదేశంలో మూడు సంస్థలు చొప్పున, రెండు థాయిలాండ్లో ఉన్నాయని EU తెలిపింది.
మూడు భారతీయ సంస్థలలో ఏరోట్రస్ట్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, అసెండ్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ ఎంటర్ప్రైజెస్గా గుర్తించారు.


