జెరూసలేం: గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, రఫా సరిహద్దు క్రాసింగ్ మూసివేసారు. దీంతో 15వేల మంది పాలస్తీనియన్లు వైద్య చికిత్స కోసం ఎదురు చూస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
కాగా, హింస, ఉరిశిక్షకు గురైనట్లు తేలిన సంకేతాలతో ఇజ్రాయెల్ గాజాకు తిరిగి ఇచ్చిన 54 మంది గుర్తుతెలియని పాలస్తీనియన్ల మృతదేహాలను సెంట్రల్ డీర్ ఎల్-బాలాలోని ఒక సామూహిక సమాధి స్థలంలో ఖననం చేశారు.
యుద్ధంలో దెబ్బతిన్న గాజాలోకి ప్రాథమిక అవసరాలను అనుమతించే బాధ్యత ఆక్రమిత శక్తిగా ఇజ్రాయెల్‌కు ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చింది, అది “యుద్ధ పద్ధతిగా ఆకలిని” ఉపయోగిస్తోందని పేర్కొంది.
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో 2023 అక్టోబర్ నుండి కనీసం 68,234 మంది మరణించారు. 170,373 మంది గాయపడ్డారు. కాగా, ఈ దాడుల్లో మొత్తం 1,139 మంది ఇజ్రాయెలీలు మరణించారు. దాదాపు 200 మంది బందీలుగా పట్టుకెళ్లిన సంగతి తెలిసిందే.


