Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

చలికాలంలో పాలస్తీనియన్ల గుడారాలను ముంచెత్తిన వరదలు!

Share It:

గాజా: అసలే చలికాలం…ఆపై వరదలు ముంచెత్తడంతో గాజాలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. మంగళవారం గాజా ప్రాంతంలో భారీ వర్షం కారణంగా వరదలు వచ్చాయితో. దీంతో వేలాది మంది నిరాశ్రయులైన పాలస్తీనియన్ల గుడారాలు మునిగిపోయాయి.

ఎప్పుడూ రద్దీగా ఉండే గాజా ఎన్‌క్లేవ్‌లో ఇజ్రాయెల్ మారణహోమంతో గాజాలోని 2 మిలియన్ల మందితమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది, ఇప్పుడు చాలామంది టెంట్లు, ఇతర ప్రాథమిక ఆశ్రయాలలో నివసిస్తున్నారు.

అక్టోబర్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా… యుద్ధం గాజాను ఓ శిథిల నగరంగా మార్చింది. చాలా మందికి దారుణమైన జీవన పరిస్థితులను మిగిల్చింది. అసలే బాధలో ఉన్న పాలస్తీనియన్లకు ఇప్పుడు వర్షంతో ముంచెత్తిన వరదలు వారిని మరింత కష్టపెడుతోంది. ఇప్పుడే శీతాకాలం ప్రారంభమైంది. దీంతో చలి కూడా గాజా వాసులను భయపెడుతోంది. పాత టెంట్లు, చినిగిపోయిన గుడారాలతో ఎలా కాలం వెళ్లదీయాలో అర్ధం కావడంలేదని పాలస్తీనియన్లు వాపోతున్నారు.

ఈమేరకు పాలస్తీనా NGOల నెట్‌వర్క్ అధిపతి అమ్జద్ అల్-షావా మాట్లాడుతూ… దాదాపు 1.5 మిలియన్ల నిరాశ్రయులను ఉంచేందుకు కనీసం మూడు లక్షల కొత్త టెంట్ల అవసరం ఉందని అన్నారు. మరోవంక గత వారంలో నిరాశ్రయ కుటుంబాలకు చెందిన వేలాది టెంట్లు వర్షపు నీటితో మునిగిపోయాయని, కుండపోత వర్షాల వల్ల దెబ్బతిన్నాయని పాలస్తీనా పౌర రక్షణ సేవ తెలిపింది.

తీరప్రాంత ఎన్‌క్లేవ్‌లోని కొన్ని ప్రాంతాలలో వరదలు నేల మట్టానికి 40 నుండి 50 సెంటీమీటర్ల ఎత్తుకు పెరగడంతో కొన్ని టెంట్లు పూర్తిగా కొట్టుకుపోయాయి, వరదల కారణంగా ఫీల్డ్ హాస్పిటల్ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చిందని వైద్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కాగా, సహాయ బృందాలపై ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా ఎన్‌క్లేవ్‌లోకి ప్రవేశించే ట్రక్కుల సంఖ్య పరిమితం చేసారని, ఫలితంగా గాజాలోకి శీతాకాలపు సామాగ్రిని తీసుకురాలేక పోతున్నామని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

కాల్పుల విరమణ ఒప్పందం కింద హామీ ఇచ్చినంత సహాయాన్ని ఇజ్రాయెల్ అందించడం లేదని హమాస్ నేతృత్వంలోని గాజా అధికారులు చెబుతున్నారు. అనేక ముఖ్యమైన వస్తువులు ప్రవేశించకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటోందని సహాయ సంస్థలు చెబుతున్నాయి.

యుద్ధ విరమణ ఒప్పందం కింద బాధ్యతలను పూర్తిగా పాటిస్తున్నామని, గాజాలోకి ప్రవేశించే ఏ సహాయాన్ని కూడా ఆపబోమని ఇజ్రాయెల్ చెబుతోంది. సహాయ సంస్థలు దానిని పంపిణీ చేయడంలో అసమర్థంగా ఉన్నాయని లేదా హమాస్ ఉగ్రవాదుల దొంగతనాన్ని నిరోధించడంలో విఫలమయ్యాయని ఇజ్రాయెల్ చెబుతోంది. సహాయాన్ని దొంగిలించడాన్ని హమాస్ ఖండించింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.