Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

స్వామిపై పోలీసు జులుం…’న కామ్‌కే’, ‘న రామ్‌కే’అంటూ బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు!

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో జరగుతున్న మాఘ మేళాలో పుణ్య స్నానం చేయకుండా తనను అడ్డుకున్నారంటూ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈమేరకు సంగం ఘాట్‌కు వెళ్లే మార్గ మధ్యలో స్వామికి జరిగిన “అవమానం”పై కాంగ్రెస్.. బీజేపీని తీవ్రంగా విమర్శించింది. ఈ “అవమానకరమైన సంఘటన”పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ‘న కామ్‌కే’,’న రామ్‌కే’ అంటూ… కేవలం అధికారం, డబ్బు కోసమే బీజేపీ నేతలు పాకులాడుతున్నారు, అంతకు మించి వారికి మతం, విశ్వాసం […]
Read more

స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తాం…కర్ణాటక ఎన్నికల సంఘం!

బెంగళూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు (ఈవీఎంలు) బదులుగా బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తామని, ఎన్నికలు మే 25 తర్వాత జరుగుతాయని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పరిధిలోని ఎన్నికల కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన తర్వాత, కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జి.ఎస్.సంగ్రేషి విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. “గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పరిధిలోని కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపల్ […]
Read more

అరబ్ ధైర్యం, ఇరానియన్ సహనం… ఓ యుద్ధాన్ని నిలువరించాయి!

టెహ్రాన్‌: ఇటీవలి ఇరాన్ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి రెండు ప్రశ్నలు కీలకమైనవి. అందులో ఒకటి ఇరాన్‌పై విధ్వంసకర దాడిని అమెరికా ప్రారంభించకుండా అరబ్ దేశాలు నిరోధించాయా? ఇరాన్ చేతిలో పెద్ద అవమానాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు స్వయంగా భయపడ్డారా? ఈ రెండు ప్రశ్నలకు ఒకే సమాధానం అవసరమైతే…”అవును! అదే నిజం.” ఇరాన్‌పై దాడికి తాము మద్దతు ఇవ్వబోమని అరబ్ దేశాలు అమెరికా (యుఎస్ఎ)కి స్పష్టం చేయడం బహుశా […]
Read more

ఎస్ఐఆర్ ప్రక్రియ…బీజేపీని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పుగా పరిణమించిందని ఆయన ఆరోపించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ…ఎస్‌ఐఆర్ పేరుతో పేదల ఓటు హక్కును లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కాషాయ పార్టీ శాశ్వతంగా అధికారంలో కొనసాగడానికి కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. ఓటు హక్కు విషయంలో ఒకప్పుడు బ్రిటిష్ వారు తెచ్చిన ముప్పునే ఇప్పుడు బీజేపీ కూడా కలిగిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. […]
Read more

రాజకీయాల్లో బిలియనీర్ల ప్రభావం పెరుగుతోంది… ఆక్స్‌ఫామ్ నివేదిక!

దావోస్‌: ప్రపంచ అసమానతలపై నివేదికలో భాగంగా, ఆక్స్‌ఫామ్ సంస్థ… భారతదేశ రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా సామాన్య ప్రజలు రాజకీయాల్లో ఎలా శక్తివంతమవుతున్నారో వివరించింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో బిలియనీర్ల ప్రభావం పెరుగుతోందని హెచ్చరించింది. భారతదేశ రిజర్వేషన్ విధానాన్ని, ముఖ్యంగా రాజకీయాల్లో అధికారాన్ని వికేంద్రీకరించడానికి, అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పించడానికి ఒక మంచి ఉదాహరణగా ఆక్స్‌ఫామ్ పేర్కొంది. అలాగే మహిళల రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై కూడా ఈ సంస్థ దృష్టి సారించింది. ఇది రాజకీయాల్లో మహిళల […]
Read more

ఎస్‌ఐఆర్…ప్రజల ఓటు హక్కుపై దాడి-పౌరసత్వం ప్రశ్నార్థకం!

అబ్దుల్ మజీద్ షోయిబ్,అధ్యక్షులు, ఎం.పి.జే తెలంగాణ. ఎస్‌ఐఆర్‌పై ప్రజా ప్రతిఘటన అవసరం హైదరాబాద్‌: ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్షాళన (SIR) పేరుతో చేపడుతున్న ప్రక్రియ వల్ల కోట్లాది పౌరుల పేర్లు ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. ఈ కారణంగా పెద్ద సంఖ్యలో పేదలు, కూలీలు, మైనారిటీలు, వలస కార్మికులు, వెనుకబడిన వర్గాల వారు ప్రభావితమయ్యారు. ఎస్‌ఐఆర్ కేవలం పరిపాలనా చర్య మాత్రమే కాదు — ఇది రాజకీయంగా ప్రభావం చూపే చర్య. దీనిపై మౌనంగా […]
Read more

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు క్యాబినెట్‌ ఆమోదం!

హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో…116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. మొత్తం 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండు రోజుల క్రితం వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. కాగా, చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల మేడారంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ చారిత్రాత్మక సమావేశం, అతిపెద్ద గిరిజన […]
Read more

స్పెయిన్‌లో రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీ…21 మంది మృతి!

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో విషాదం చోటుచేసుకుంది. అండలూసియా దక్షిణ ప్రాంతంలో రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 21 మంది మృతి చెందగా, 70 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం మలగా నుండి మాడ్రిడ్‌కు వెళ్తున్న ఒక సర్వీస్ ఆడముజ్ సమీపంలో పట్టాలు తప్పడంతో, మరొక ట్రాక్‌పైకి వెళ్లి, ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టడంతో ఈ విపత్తు సంభవించిందని స్పెయిన్‌కు చెందిన అడిఫ్ రైలు నెట్‌వర్క్ ఆపరేటర్ Xలో పోస్ట్ చేశారు. పోలీసు ప్రతినిధి AFPకి 21 […]
Read more

‘ఎస్‌ఐఆర్‌’ ద్వారా ఏకంగా 6.5 కోట్ల మంది ఓటర్ల తొలగింపు దేనికి సంకేతం!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ద్వారా ఏకంగా 6.5 కోట్ల మంది ఓటర్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. 2025అక్టోబర్ 27న, భారత ఎన్నికల సంఘం, తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, 1950లో సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రవేశపెట్టినప్పటి నుండి భారతదేశం ఈ స్థాయిలో ఓటర్ల తొలగింపును ఎప్పుడూ చూడలేదు – యుద్ధాల సమయంలో… కరువు సమయంలో కూడా కాదు, […]
Read more

గాజా పాలన కోసం కార్యనిర్వాహక బోర్డును ఆవిష్కరించిన వైట్ హౌస్!

వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ జాతి విధ్వంసక యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన 20-పాయింట్ల ప్రణాళికలో భాగంగా…. గాజా “పీస్ బోర్డ్” సభ్యులను వైట్ హౌస్ ఆవిష్కరించింది. గాజా పరిపాలన కోసం జాతీయ కమిటీ (NCAG) నాయకత్వాన్ని ధృవీకరించింది. కాగా, NCAGకి మాజీ పాలస్తీనా అథారిటీ డిప్యూటీ మంత్రి డాక్టర్ అలీ షాత్ నాయకత్వం వహిస్తారని వైట్ హౌస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు షాత్‌ను “విస్తృతంగా గౌరవించే సాంకేతిక నాయకుడు”గా అభివర్ణించారు, […]
Read more
1 … 101 102 103 104 105 … 237

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.