Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘అమెరికా మా రక్షకుడు కాదు’…మా భద్రత మేమే చూసుకుంటామన్న నెతన్యాహు!

టెల్ అవీవ్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో గాజా చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. ఇజ్రాయెల్ తన భద్రతను తానే చూసుకుంటుందని, తమ దేశం అమెరికా రక్షిత ప్రాంతం కాదని నెతన్యాహు స్పష్టం చేశారు. కాగా, వాన్స్‌తో సమావేశానికి ముందు నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. గాజాలో అంతర్జాతీయ దళాలను మోహరిస్తే భవిష్యత్తులో ఆ ప్రాంతం నుంచి ఉద్భవించే భద్రతా ముప్పుకు ఇజ్రాయెల్‌ సమాధానం చెప్పే అవకాశాలు […]
Read more

తెలంగాణలో రవాణా చెక్‌పోస్టుల మూసివేతకు ఆదేశాలు!

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా చెక్‌పోస్టులను వెంటనే మూసివేయాలని తెలంగాణ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. జీఎస్టీ అమలు తర్వాత చెక్‌పోస్టుల అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వాహనాల ప్రయాణంలో, సరకుల రవాణాలో ఆలస్యాన్ని తగ్గించి సజావుగా రవాణా సాగేందుకు వీలవుతుంది. ఈమేరకు డిప్యూటీ రవాణా కమిషనర్లు, జిల్లా రవాణా అధికారులు తమ కార్యకలాపాలను వెంటనే నిలిపివేసి, సాయంత్రం ఐదు గంటలలోపు […]
Read more

చెన్నైలో భారీవర్షాలు…జనజీవనం అస్థవ్యస్తం!

చెన్నై: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై తల్లడిల్లిపోతోంది. వర్షం ధాటికి రోడ్లు జలమయం అయ్యాయి. ఈశాన్య రుతుపవనాల కారణంగా చెన్నై జల దిగ్బంధంలో చిక్కుంది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మౌలిక సదుపాయాల పనులను పరిశీలిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. మేడవాక్కం,పల్లికరణైలో గుంతలతో నిండిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. వీటిని స్థానికులు ‘డెత్ ట్రాప్స్’గా అభివర్ణించారు, ఇవి సంవత్సరాలుగా ఉన్నాయి. మరోవంక రాష్ట్రంలో భారీ వర్షపాతం కురవచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు […]
Read more

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రికార్డు స్థాయిలో 283 నామినేషన్లు!

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనూహ్యంగా రికార్డుస్థాయి నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి ఆరు రోజుల్లోనే 94మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 189 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించడానికి వచ్చారు. అధిక సంఖ్యలో పోలింగ్ నమోదు కావడం, మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉండటం వల్ల, అభ్యర్థులు వరుసగా తమ పత్రాలను దాఖలు చేయడానికి వీలుగా రిటర్నింగ్ అధికారి టోకెన్లు జారీ చేశారు. రాత్రి 9:30 […]
Read more

ఆసియాకప్‌ ట్రోఫీ వార్‌…నఖ్వీ మొండితనంపై ఐసీసీ జోక్యం కోరుతున్న బీసీసీఐ!

న్యూఢిల్లీ: ఆసియా కప్ ట్రోఫీపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ట్రోఫీ ఇంకా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంటికి చేరుకోలేదు. ఈమేరకు పాకిస్తాన్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్ మోహ్సిన్ నఖ్వీకి BCCI లేఖ రాసినప్పటికీ ట్రోఫీని అందజేయడానికి నిరాకరించారు. దీనికి ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక బోర్డులు కూడా మద్దతు ఇస్తున్నాయి. దుబాయ్‌లోని ప్రధాన కార్యాలయంలో బీసీసీఐ ప్రతినిధి తన నుండి ట్రోఫీని తీసుకోవాలని నఖ్వీ పట్టుబట్టినట్లు సమాచారం. కానీ భారత బోర్డు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. వచ్చే నెలలో జరిగే […]
Read more

“పరిస్థితుల కారణంగా”ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నా…బీహార్‌ సీఎం నితీష్ కుమార్!

ముజఫర్‌పూర్: రికార్డు స్థాయిలో వరుసగా ఐదవసారి సీఎం పదవిని ఆశిస్తున్న నితీష్‌కుమార్‌ ముజఫర్‌పూర్ జిల్లాలోని మినాపూర్ నియోజకవర్గంలో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. లాలూ ప్రసాద్ అధికారంలో ఉన్నప్పుడు “మహిళల కోసం ఏమీ చేయలేదని”, దాణా కుంభకోణంలో ఛార్జ్ షీట్ తనను పదవి నుంచి దిగిపోయేలా చేసినప్పుడు భార్య రబ్రీ దేవిని ఆసరాగా చేసుకున్నారని నితీష్‌ ఆరోపించారు. మహిళా సాధికారతలో తన ప్రభుత్వం ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ…ఇటీవల ప్రారంభించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం […]
Read more

ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించిన రామ్ గోపాల్ వర్మ ‘గాజా-దీపావళి పోస్ట్’!

ముంబై: వివాదాస్సద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ X లో పెట్టిన దీపావళి పోస్ట్‌పై అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తం అయింది. “భారతదేశంలో ఒక్క రోజే దీపావళి, కానీ గాజాలో రోజూ దీపావళి” అని పోస్ట్ చేసి, దానికి మూడు ఫైర్ ఎమోజీలను జోడించారు. ఈ ట్వీట్ పోస్ట్ చేసిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూ దీపాల ఆనందకరమైన పండుగను గాజాపై ఇజ్రాయెల్ నిరంతర బాంబు దాడితో పోలుస్తూ చేసిన వ్యాఖ్య, క్రూరమైనది, అసభ్యకరమైనది, ఈ […]
Read more

పాలస్తీనా రైతులపై క్రూరంగా దాడి చేసిన ఇజ్రాయెలీ సెటిలర్‌!

గాజా: సెంట్రల్ వెస్ట్ బ్యాంక్‌లోని తుర్ముస్ అయ్య గ్రామంలో ముసుగు ధరించిన యూదు సెటిలర్‌ ఒక పాలస్తీనా మహిళపై కర్రతో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ దాడిని అమెరికా జర్నలిస్ట్ జాస్పర్ నథానియల్ వీడియోలో బంధించారు, ఇజ్రాయెల్ వలసదారుడు 55 ఏళ్ల పాలస్తీనా మహిళా రైతును కర్రతో స్పృహ కోల్పోయేలా కొట్టాడని ఆయన అన్నారు. ఆ మహిళను అఫాఫ్ అబు అలియా, అలియాస్ ఉమ్మె సలేహ్ గా గుర్తించారు, ఆమె తన కుటుంబం కోసం […]
Read more

తల్లిదండ్రులకు నకిలీ పోలీసుల కాల్స్…అప్రమత్తంగా ఉండాలన్న హైదరాబాద్ సీపీ!

హైదరాబాద్: పోలీసులుగా నటిస్తూ, తమ పిల్లలు కిడ్నాప్ అయ్యారని వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ కోరారు. “నేరగాళ్లు మీ పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్దాన్ని ప్లే చేస్తే, భయపడవద్దు లేదా మానసికంగా బాధపడకండి. ఆందోళన, భయం.. ఈ రెండూ సైబర్ నేరస్థులకు వరంగా మారుతున్నాయి. ఈ నేరాలకు చెక్ పెట్టడానికి, అప్రమత్తతతో పాటు అవగాహన కూడా అవసరం” అని పోలీస్ కమిషనర్ ‘X’లో […]
Read more

గాజా కాల్పుల విరమణను 80 సార్లు ఉల్లంఘించిన ఇజ్రాయెల్…97 మంది మృతి!

గాజా : అమెరికా మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ అక్టోబర్ 10న అమల్లోకి వచ్చింది. అప్పటినుండి గాజా స్ట్రిప్ అంతటా ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 97 మంది పాలస్తీనియన్లు మరణించగా, 230 మందికి పైగా గాయపడ్డారని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది. రెండు వారాల కంటే తక్కువ సమయంలో ఇజ్రాయెల్ 80 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని, ఈ సంఘటనలను “అంతర్జాతీయ మానవతా చట్టాన్ని క్రమబద్ధంగా ఉల్లంఘించడం”గా అభివర్ణిస్తూ మీడియా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. […]
Read more
1 42 43 44 45 46 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.