Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

దేశంలో 40% ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్‌ రిపోర్ట్‌!

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పది మంది ముఖ్యమంత్రులలో నలుగురు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 30 మంది సిట్టింగ్ ముఖ్యమంత్రుల స్వీయ ప్రమాణ స్వీకార అఫిడవిట్లను అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. 12 మంది ముఖ్యమంత్రులు (40%) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని, 10 మంది (33%) హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, క్రిమినల్ బెదిరింపు వంటి […]
Read more

గాజాలో కాల్పుల విరమణ డిమాండ్ చేస్తూ ఢిల్లీలో భారీ నిరసన!

న్యూఢిల్లీ: గాజా ప్రజలకు సంఘీభావంగా, ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను ఖండిస్తూ… దేశ రాజధానిలో భారీ ప్రదర్శన జరిగింది. ఈ నిరసనలో విభిన్నవర్గాల నేతలు పాల్గొన్నారు. పెరుగుతున్న మానవతా సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ, పరిసర రాష్ట్రాల నుండి విద్యార్థులు, పౌర సమాజ కార్యకర్తలు,రాజకీయ – మత నాయకులతో సహా వందలాది మంది పౌరులు ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనాకు మద్దతు ప్రకటించే విషయంలో మతపరమైన, సైద్ధాంతిక సరిహద్దులను అధిగమించి శాంతి, న్యాయం పట్ల […]
Read more

ఇజ్రాయెల్ ఆంక్షల ప్రతిష్టంభనపై డచ్ విదేశాంగ మంత్రి రాజీనామా!

ఆమ్‌స్టర్‌డామ్: గాజాలో సైనిక దాడికి సంబంధించి ఇజ్రాయెల్‌పై అదనపు ఆంక్షలకు క్యాబినెట్ మద్దతు పొందడంలో విఫలమైన తర్వాత డచ్ విదేశాంగ మంత్రి కాస్పర్ వెల్డ్‌క్యాంప్ రాజీనామా చేశారు. సెంటర్-రైట్ న్యూ సోషల్ కాంట్రాక్ట్ పార్టీ సభ్యుడు వెల్డ్‌క్యాంప్ మాట్లాడుతూ…”అర్థవంతమైన చర్యల”పై తాను ఒప్పందం కుదుర్చుకోలేకపోయానని, ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలపై సహచరుల నుండి పదేపదే ప్రతిఘటనను ఎదుర్కొన్నానని అన్నారు. పాలస్తీనియన్లపై హింసను ప్రేరేపించడంలో సెటిలర్స్‌ పాత్రను పేర్కొంటూ, ఇజ్రాయెల్ మంత్రులు బెజలెల్ స్మోట్రిచ్, ఇటామర్ బెన్-గ్విర్‌లపై తమదేశంలోకి […]
Read more

‘ఫ్రీడమ్ ప్రెస్’ ఢిల్లీ ఎడిషన్‌ ప్రారంభం!

న్యూఢిల్లీ: హైదరాబాద్ నుండి గతంలో ప్రచురితమయ్యే ఆంగ్ల దినపత్రిక ఫ్రీడమ్ ప్రెస్… తన ఢిల్లీ ఎడిషన్‌ను ప్రారంభించింది. తద్వారా దేశ డైనమిక్ మీడియా ప్రపంచంలోకి ప్రవేశించింది. మీడియాలో నీతి, స్వాతంత్ర్యం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో…ఫ్రీడమ్‌ ప్రెస్‌ వార్తాపత్రిక స్వేచ్ఛ, వాక్‌ స్వాత్యంత్య్రం, పారదర్శకత, జర్నలిజం విలువలను నిలబెడతామని ప్రతిజ్ఞ చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, పార్లమెంటేరియన్లు, విద్యావేత్తలు, పౌర సమాజ నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుక అహ్లాదకర వాతావరణంలో ఘనంగా జరిగింది. ప్రజాస్వామ్యం, […]
Read more

ప్రధాని మోదీ గయ పర్యటనపై మండిపడ్డ లాలూ యాదవ్!

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గయలో పర్యటించడంపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర విమర్శలు చేయడంతో రాజకీయ వివాదం మరింత తీవ్రమైంది. ఈమేరకు లాలూ ప్రసాద్ యాదవ్ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. “గయ పిండ్ దానానికి ప్రసిద్ధి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గయకు వస్తున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. పేదలు, వెనుకబడిన ప్రజలకు ఓటు హక్కును ఈ […]
Read more

జీఎస్‌టీ పునర్విభజనలో దక్షిణ రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలని భట్టి విక్రమార్క డిమాండ్!

హైదరాబాద్: ప్రతిపాదిత GST రేటు హేతుబద్ధీకరణలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో GST రేటు జరిగిన మంత్రుల బృందం (GoM) సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, రేటు హేతుబద్ధీకరణ, పన్ను భారాన్ని తగ్గించే ప్రతిపాదనను స్వాగతించారు. అయితే అదే సమయంలో, రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే, పేద ప్రజలు, మధ్యతరగతి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఉద్దేశించిన […]
Read more

వచ్చే ఎన్నికల్లో తమిళ ప్రజలు ‘విజయ్‌’ను ఆశీర్వదిస్తారా?

చెన్నై: తమిళనాడు రాజకీయాలు సినిమా పరిశ్రమతో తమ అనుబంధాన్ని తెంచుకోవడానికి నిరాకరిస్తున్నాయి. కొత్త సహస్రాబ్దిలోకి వచ్చి 25 సంవత్సరాలు గడిచిన తర్వాత, టైమ్ జోన్‌ను 1977కి తిరిగి తీసుకెళ్లడానికి మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అప్పుడు అగ్రశ్రేణి సినీ నటుడు – ఎం జి రామచంద్రన్ – స్థాపించిన, కేడర్ ఆధారిత ప్రాంతీయ పార్టీ – ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె)తో విడిపోయి – అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎడిఎంకె)-ను స్థాపించి, ద్రవిడ రాష్ట్రాన్ని 13 […]
Read more

గాజా స్వాధీనానికి తుది ఆమోదం తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని!

డీర్ అల్-బలా: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గురువారం గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళికలకు తుది ఆమోదం తెలిపారు. ఈ ఆపరేషన్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కావచ్చు. ‘గిడియన్స్ చారియట్స్ II’ పేరుతో చేపట్టనున్న ఈ ఆపరేషన్ లక్ష్యం గాజా నగరాన్ని చుట్టుముట్టి హమాస్‌ను నిర్మూలించడం, బందీలను విడిపించడం, పూర్తి భద్రతా నియంత్రణను స్థాపించడం అని తెలుస్తోంది. గాజాలోని హమాస్ స్థావరాలను వీలైనంత త్వరగా ఓడించి, నగరాన్ని అదుపులోకి తీసుకునేందుకు కాలపరిమితిని తగ్గించాలని ప్రధాని […]
Read more

ప్రైవేట్ వర్సిటీల్లో SC/ST విద్యార్థులు: పార్లమెంటరీ కమిటీ షాకింగ్ నివేదిక!

దేశంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నేడు వేలాది మంది విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. అయితే విశ్వవిద్యాలయ తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు, అక్కడ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు స్వల్ప సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నారు. ఇది అతిశయోక్తి కాదు; ఇది నేటి భారతదేశ ప్రైవేట్ ఉన్నత విద్యా వ్యవస్థలో నెలకొన్న స్పష్టమైన వాస్తవిక చిత్రం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదిక… ఈ అన్యాయాన్ని బహిర్గతం చేసింది, ప్రైవేట్ సంస్థలలో SC/ST విద్యార్థుల ప్రాతినిధ్యం “చాలా తక్కువగా ఉంది. ఇది చాలా […]
Read more

అమెరికా సుంకాల బెదిరింపుల మధ్య, చమురు సరఫరాకు హామీ ఇచ్చిన రష్యా!

న్యూఢిల్లీ: అమెరికా సుంకాల బెదిరింపులు ఉన్నప్పటికీ రాయితీ చమురు సరఫరాను కొనసాగిస్తామని మాస్కో ప్రతిజ్ఞ చేసింది. భారతదేశ వాణిజ్య లోటును పరిష్కరించాలని విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాను ఒత్తిడి చేశారు. ఇందులో భాగంగా భారత్‌లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలను (Russian Companies) ఆహ్వానించారు. భారతదేశం, చైనాతో త్రైపాక్షిక చర్చలు త్వరలో తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. మాస్కోలో బుధవారం జరిగిన భారత్–రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ పాల్గొన్నారు. […]
Read more
1 67 68 69 70 71 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.